Begin typing your search above and press return to search.

మైనర్ ఓకే అన్నాక సెక్స్ చేసినా శిక్షే?

By:  Tupaki Desk   |   10 April 2016 9:47 AM GMT
మైనర్ ఓకే అన్నాక సెక్స్ చేసినా శిక్షే?
X
ఇద్దరి మధ్య పరస్పర ఆమోదంతో శృంగారంలో పాల్గొంటే నేరం కాదన్నది తెలిసిందే. మేజర్ల విషయంలో అయితే అది ఓకే. కానీ.. మైనర్ల విషయంలో మాత్రం అలాంటిది కుదరనే కుదరదని తేల్చి చెప్పింది పంజాబ్.. హర్యానా హైకోర్టు. ఒక మైనర్ తన ఆమోదంతో శృంగారం చేసినా.. ఆ తర్వాత ఆమె కానీ కేసు పెడితే.. దాన్ని రేప్ కిందనే పరిగణిస్తారే తప్పించి.. నేరం కాదనటానికి ఛాన్స్ లేదన్న సంచలన తీర్పును పంజాబ్ హైకోర్టు తాజాగా ఇచ్చింది.

ఒక కేసుకు సంబంధించి మైనర్ ఇష్టపూర్వకంగా తాను శృంగారం జరిపినట్లుగా నిందితుడు చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనంస్పందిస్తూ.. 16 ఏళ్ల లోపు బాలిక సెక్స్ కు ఓకే చెప్పిందంటూ ఆమెను లోబర్చుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది.16 ఏళ్ల యువతితో సెక్స్ లో పాల్గొన్న భాగస్వామి క్రిమినల్ అవుతారని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇద్దరు పరస్పర అనుమతితో సెక్స్ చేసినా.. తర్వాత కానీ సదరు బాలిక కేసు పెడితే అది రేప్ కిందకు వస్తుందని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఒక బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటనకు సంబంధించి గుడ్ గా వ్ జిల్లా కోర్టు ఇచ్చిన పదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ హైకోర్టుకు నిందితుడు అప్పీలుకు వచ్చాడు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం.. నిందితుడు పదేళ్ల శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడికి ఇంతకు ముందు పెళ్లి అయి.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. 2010 జనవరిలో ఒక బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ కేసులో సదరు నిందితుడికి పదేళ్లు శిక్ష విధించారు. అయితే.. ఆ బాలిక ఆమోదంతోనే తాను సెక్స్ చేసినట్లుగా చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోకపోవటం గమనార్హం.