Begin typing your search above and press return to search.

మా తల్లిదండ్రుల్ని స్పాట్ లోనే ఎన్ కౌంటర్ చేసేయాలి

By:  Tupaki Desk   |   27 Sept 2020 6:00 PM IST
మా తల్లిదండ్రుల్ని స్పాట్ లోనే ఎన్ కౌంటర్ చేసేయాలి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హేమంత్ హత్య ఉదంతంలో ఆయన సతీమణి అవంతి తాజాగా మాట్లాడారు. ఒక చానల్ తో మాట్లాడిన ఆమె.. తన భర్తను పొట్టన పెట్టుకున్న తన తల్లిదండ్రుల్ని.. వారికి సాయం చేసిన వారెవరిని విడిచిపెట్టకూడదని కోరారు. తన తల్లిదండ్రుల్నిస్పాట్ లోనే ఎన్ కౌంటర్ చేయాలంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆమె ఒక విన్నపాన్ని చేశారు. కేసీఆర్ సార్.. జగన్ సార్ నాకు న్యాయం చేయండి. కేటీఆర్ సార్ నాకు సాయం చేయండి. మీరంతా నాతో ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత.. తాము ఒప్పుకోమని.. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి చెప్పినట్లుగా పేర్కొన్నారు.

తానే ఇష్టపూర్వకంగా బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. హేమంత్ ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనే వ్యక్తి కాదన్నారు. తమ జీవితాన్ని తాము అనుకున్నట్లు అందంగా తీర్చిదిద్దుకునే సమయంలోనే ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. ఎవరిని నొప్పించే తత్త్వం లేని హేమంత్.. జీవితాన్ని ఇలా ముగిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘వాళ్లంతా బాస్టర్డ్స్. జీవితకాలం ఈ బాధ నాకు ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందో అతనికి తెలియకుండానే జరిగిపోయింది. అంత ఈజీగా వదిలేయను. మీరంతా నాతో ఉండాలి. వాళ్లంతా ధన బలం చూపిస్తారు’’ అని అవంతి పేర్కొన్నారు.

పది లక్షలకు హేమంత్ ను చంపేశారని.. తానిప్పుడు రూ.10కోట్లు ఇస్తానని.. బతికిస్తారా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల నుంచి తనకు హేమంత్ తో పరిచయం ఉందని.. ఇంటర్ నుంచి తమ మధ్య బంధం ఉండేదని.. తన తండ్రి తనకు వద్దనిచెప్పారని తాను వినలేదన్నారు. తనను ఇంట్లో బంధిస్తే .. తానే సొంతంగా బయటకు వచ్చేశానని.. పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పెళ్లి తర్వాత దాడి జరుగుతుందన్న ఉద్దేశంతో తాము సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ ను కలిసి రక్షణ ఇప్పించాలని కోరినట్లు చెప్పారు.

ఇంటికే వచ్చి ఇంత దుర్మార్గానికి పాల్పడతారని తాము అనుకోలేదన్న అవంతి.. ఇక పై తన తల్లిదండ్రులు హేమంత్ పేరెంట్సే నని.. తన మరిది ఇక పై తన సోదరుడిగా చూసుకుంటానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని.. తాను మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు.