Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డి సభతో కమలనాథులకు భారీ షాక్ తగిలిందా?
By: Tupaki Desk | 31 Oct 2020 12:20 PM ISTదుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ.. తెలంగాణ రాజకీయ వాతావరణం అంతకంతకూ హీటెక్కుతోంది. తొలుత అనుకున్నట్లుగా పోటీ జరుగుతున్నది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నది కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారటం ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. బీజేపీ చేసిన ప్లానింగ్ తో.. అధికారపక్షం మొత్తం తమ మీద ఫోకస్ చేసేలా చేయటమే కాదు.. బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నాడన్న భావన కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
అనూహ్యంగా వచ్చిన అధిక్యతను.. మైలేజీని మరింత పెంచుకోవటానికి కమలనాథులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏమో.. కాలం కలిసి వస్తే గుర్రం ఎగరావచ్చన్న రీతిలో గంపెడు ఆశల్ని పెట్టుకున్నారు. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరాలన్న పట్టుదలతో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాకలో ఏర్పాటు చేసిన సభ బీజేపీ నేతలకు షాకిచ్చిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. భారీ అంచనాలతో ఏర్పాటు చేసిన సభకు.. ఆశించినంత పబ్లిక్ రాకపోవటంతో.. పలు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా.. వాట్సాప్ లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాము ఏర్పాటు చేసిన సభకు భారీగా జనాలు వస్తారని గంపెడు ఆశల్ని పెట్టుకొన్నారు బీజేపీ నేతలు. సాయంత్రం నాలుగున్నర గంటలకు సభాస్థలి వద్ద జనం పెద్దగా లేకపోవటంతో కుర్చీలుఖాళీగా కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. సభకు హాజరైన జనాల కంటే కూడా పోలీసులే ఎక్కువగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో.. పలువురు కుర్చీల్లో నుంచి లేచి వెళ్లిపోయారని.. ఆయన మాటల్ని వినేందుకు పెద్ద ఆసక్తిని చూపించలేదన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఎన్నికల పోలింగ్ కు ముందు చోటు చేసుకున్న పరిణామాలు.. బీజేపీ నేతల్ని మరింత నిరాశలోకి ముంచెత్తే అవకాశం ఉందంటున్నారు.గుర్రం ఎగరటం తర్వాత.. దానికి ఉండాల్సిన కనీస గౌరవమైనా దక్కుతుందంటారా?