Begin typing your search above and press return to search.

ఆఫీసులకు రాం.. యాపిల్ కంపెనీ పై ఉద్యోగుల పిటీషన్!

By:  Tupaki Desk   |   23 Aug 2022 10:30 AM GMT
ఆఫీసులకు రాం.. యాపిల్ కంపెనీ పై ఉద్యోగుల పిటీషన్!
X
కరోనాకు ముందూ అందరూ ఆఫీసులకు వెళ్లేది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ ఠంచనుగా పనిచేసి ఇంటికొచ్చేవారు. కానీ కరోనా తర్వాత అందరి జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. వృత్తిపరంగా పనివిధానాలు పూర్తిగా మారాయి.

ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం కరోనా బారిన పడకుండా 'వర్క్ ఫ్రం హోం' విధానాన్ని అమలు చేశాయి. కరోనా ప్రభావం తగ్గినా ఇంటి నుంచే పనిచేసుకునే సదుపాయాన్ని కల్పించాయి.సంస్థప్రయోజనాల కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పనిచేసుకునే వర్క్ ఫ్రం ఎనీవేర్ స్వేచ్ఛను కల్పించింది. కొంత మంది సిబ్బంది ఆఫీసుకు వస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.

కరోనా వేళ ఏ ముహూర్తాన 'వర్క్ ఫ్రం హోం' అన్నారో కానీ ఈ రెండేళ్లుగా ఇంటినుంచే పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు బద్దకిస్తున్నారు. ఇల్లు వదిలి ఆఫీసులకు రామని మారాం చేస్తున్నారు. ఆఫీసు కంటే ఇల్లే బెటర్ అని అంటున్నారు. అందుకే ప్రఖ్యాత యాపిల్ కంపెనీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలిచినా వెళ్లడం లేదు. ఏకంగా సంస్థపైనే ఉద్యోగులు పిటీషన్ వేసిన పరిస్థితి నెలకొంది.

కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావాలంటే మొండికేస్తున్నారు. రావాల్సి వస్తే రిజైన్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇప్పుడు తాజాగా యాపిల్ ఉద్యోగులు ఏకంగా సంస్థపై పిటీషన్ దాఖలు చేశారు. రోజూ ఆఫీసులకు రావాలనే రూల్ ను సడలించి వారానికి మూడు రోజులు చేసినా తగ్గట్లేదు.. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆన్ లైన్ పిటీషన్ లో సంతకాలు చేస్తున్నారు.

కోవిడ్19 కారణంగా మొదలైన వర్క్ ఫ్రం హోం పనివిధానంతో ఖర్చులు తగ్గడం కూడా కంపెనీలకు కలిసి వచ్చింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో కంపెనీలు భారీగా ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి.

అయితే ఇంట్లో ఉండి రెండు కంపెనీలకు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు పెరిగిపోయారు. తద్వారా చేస్తున్న కంపెనీకి న్యాయం చేయలేకపోతున్నారు. కొందరు ఉద్యోగుల తీరుతో తాము చాలా నష్టపోయామని అందువల్ల కంపెనీ యాజమాన్యాలంతా కలిసి ఇప్పుడు ఆఫీసులకు రావాలని హుకూం జారీ చేస్తున్నారు.. ఉద్యోగులు తాము పనిచేసే చోట సీసీ కెమెరాలను అమరుస్తున్నామని కొన్ని కంపెనీలు అంటున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఆఫీసులకు రామని.. వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని లేదంటే రిజైన్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. .