Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్‌ పై ఉద్యోగుల పేర‌డీ సాంగ్స్‌.. సోష‌ల్ మీడియా షేక్

By:  Tupaki Desk   |   22 Jan 2022 10:40 AM GMT
సీఎం జ‌గ‌న్‌ పై ఉద్యోగుల పేర‌డీ సాంగ్స్‌.. సోష‌ల్ మీడియా షేక్
X
ఏపీలో ఉద్యోగులు వ‌ర్సెస్ ప్ర‌బుత్వానికి మ‌ధ్య పీఆర్సీ ర‌గ‌డ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర మంలో ఉద్యోగులు రోడ్డెక్కారు. స‌హ‌జంగానే ఉద్య‌మం అంటే.. కేవ‌లం మాట‌లు.. నినాదాలే కాదుకదా.. కొంత ఉప్పు కారం..కూడా క‌లుపుతారు. పాట‌లు.. ఈల‌లు.. మోత‌లు.. ఇలా కామ‌న్‌. ఉద్య‌మాల స్థాయి ఒక రేంజ్‌కు చేర్చేది కూడా పాట‌లే. ఇప్పుడు ఉద్యోగులు కూడా ఇదే బాట‌ప‌ట్టారు. తాజాగా వ‌చ్చిన పుష్ప సినిమాలోని సూప‌ర్ హిట్ సాంగ్ ఊ..అంటావా మావ‌.. పాట‌కు పేర‌డీ క‌ట్టారు. ప్ర‌భుత్వంపై స‌టైర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఉ.. అంటావా సీఎం .. ఉఊ .. అంటావా.. సీఎం అంటూ.. పేర‌డీ సాంగ్స్‌తో ఉద్యోగులు ఇర‌గ‌తీస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ఈ పాట మ‌హిళా ఉద్యోగులు.. పురుష ఉద్యోగులు కూడా పాడుతూ.. డ‌ప్పులు మోగిస్తూ.. ఉద్య‌మాన్ని మ‌రింత ఊపేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈపాట‌లు.. సోష‌ల్ మీడియాలోనూ హ‌ల్చ‌ల్ రేపుతున్నా యి. ‘ఊ అంటావా సీఎం… ఉఊ అంటావా’ అని పాటరూపంలో ప్రశ్నించారు. ‘కొత్త కొత్త జీతాలన్నావు.. పాతపాత జీతాలకు ఎసరుపెట్టావు’ అంటూ దుమ్మెత్తిపోశారు. ప్ర‌స్తుతం ఈ పాట కూడా మిలియ‌న్ షేర్‌లు దాటేలా ఉంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు.. ’ఇంతన్నాడు అంతన్నాడే గంగ‌రాజు’ అనే సాంగ్‌కు కూడా పార‌డీ క‌ట్టారు. ఇంత‌న్నాడంత‌న్నాడే జ‌గ‌నూ.. అంటూ ఉద్యోగులు స్వ‌రం మార్చి.. చిందులు తొక్కుతున్నారు. మ‌రోచోట… ‘అయ్యయ్యో వద్దమ్మా’ అనే ఒక టీపొడి బ్రాండ్ వ్యాపార‌ ప్రకటనకు కూడా పేరడీ కట్టారు. “అయ్యయ్యో వద్దమ్మా… పక్కనే సీఎం ఉన్నాడు… పెద్ద పీఆర్సీ ఇస్తానన్నాడు… ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్నాడు… మా దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు… సుఖీభవ… సుఖీభవ” అని చిందేశారు.

ఇలా.. ఉద్యోగులు త‌మ ఉద్య‌మంంలో పేర‌డీ సాంగ్స్‌ను జొప్పిస్తూ.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఉద్య‌మంలో ఒక‌ సీఎంపై అదిరిపోయే రేంజ్‌లో ప‌పేర‌డీ సాంగ్స్ రావ‌డం ఇదే తొలిసార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. న‌వ్వుకునేందుకు మాత్ర‌మేన‌ని.. స‌ద‌రు పాట‌లు రాశార‌ని.. దీనిని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రాజ‌కీయ నేత‌లు కూడా అంటున్నారు. మ‌రి వైసీపీ నేత‌లు కూడా దీనిని లైట్ తీసుకుంటారో.. సీరియ‌స్ అవుతారో చూడాలి.