Begin typing your search above and press return to search.
ప్రభుత్వంపై మంటతో రోడ్డెక్కిన ఉద్యోగులు
By: Tupaki Desk | 2 Sept 2021 4:05 PM ISTజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రోడ్డెక్కారు. పెన్షన్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే తమ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో చేసేదిలేక మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలకు అనుగుణంగానే ఉద్యోగసంఘాల నాయకత్వంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇఫుడు కూడా జగన్ మేల్కోకపోతే ముందు ముందు ఉద్యోగులతో ఇబ్బందులు తప్పేట్లులేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగుల పెన్షన్ విషయంలో సీపీఎస్ అనే విధానాన్ని కేంద్రం పట్టుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఆందోళన తర్వాత కొత్త విధానం అమలు బాధ్యతలను కేంద్రం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. అప్పటినుండి ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు చాలాసార్లే కలిశారు. అయినా ఉపయోగం కనబడలేదు.
ఇదే నేపథ్యంలో పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ను కూడా ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి వెంటనే జగన్ హామీ ఇచ్చేశారు. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. పైగా కమిటీలంటు ఎలాంటి సాకులు చెప్పకుండానే రద్దు చేసేస్తానని ప్రకటించారు. మరి అప్పుడు ప్రకటించినట్లే తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని మాత్రం మరచిపోయారు.
తన హామీకి విరుద్ధంగా సీపీఎస్ రద్దుపై కమిటీని వేశారు. చివరకు చంద్రబాబు బాటలోనే జగన్ కూడా ప్రయాణిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు. సమ్మె హెచ్చరిక చేసినా ప్రభుత్వంలో చలనం రాలేదు. దాంతో చేసేది లేక చివరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలకు దిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని జగన్ పై ఉద్యోగులు చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే అవేవి వర్కవుట్ కాలేదు.
అసలు సీపీఎస్ విధానాన్ని రద్దుచేయటంలో ప్రభుత్వానికి ఉన్న సమస్యేమిటో అర్ధం కావటం లేదు. పాత విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలో ఎందుకు వెనకాడుతున్నారో తెలీటం లేదు. ఒకవేళ సీపీఎస్ విధానాన్నే అమలు చేయాలనుకుంటే అదే స్పష్టంగా చెప్పేయాలి. అప్పుడు ప్రభుత్వం వైఖరిపై ఏమిచేయాలో ఉద్యోగులు తమ నిర్ణయం తాము తీసుకుంటారు. నిజానికి ఉద్యోగులను దూరం చేసుకోవాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. మరలాంటపుడు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంలో ఎందుకు వెనకాడుతోంది.