Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగుల సెగ‌.. ఇలా అయితే.. క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   27 July 2021 8:38 AM GMT
జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగుల సెగ‌.. ఇలా అయితే.. క‌ష్ట‌మే!
X
నోరుందిక‌దా.. ప్ర‌జ‌లు వింటున్నారు క‌దా.. అని హామీలు ఇచ్చేస్తే.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌డుతున్న ఇబ్బందులే ప‌డాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆయ‌న అధికార‌మే ప‌ర‌మావ ధిగా.. హామీల వ‌ర‌ద పారించారు. ఇప్పుడు ఆ హామీల‌ను అమ‌లు చేసే క్ర‌మంలో ఎదుర‌వుతున్న తీవ్ర ఆర్థిక క‌ష్టాలు.. జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆయ‌న స‌ర్కారుకు ఎస‌రు పెడుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించి ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌ చాలా హామీలు ఇచ్చారు. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల‌కు ముందు తాము అధికారంలోకి వ‌స్తే... వారంలోపు పాత పింఛ‌ను విధానాన్ని పున‌రుద్ధ‌రిస్తాన‌ని అన్నారు. వాస్త‌వానికి ఇదే మంత తేలిక విష‌యం కాదు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా దీనిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించారు.కానీ, ఇది సాధ్యం కాకే ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్‌.. హామీ గుప్పించారు. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యింది.

అయిన‌ప్ప‌టికీ సీపీఎస్‌కు సంబంధించి ఎలాంటి పురోగ‌తి లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సీపీఎస్ విష‌య‌మై జ‌గ‌న్ త‌న హామీని గుర్తు చేయ‌డంతో పాటు నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఉద్యోగులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాత పింఛ‌ను విధానాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతూ ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ (ఏపీసీపీఎస్ఈఏ) ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించింది. వ‌ర్చు వ‌ల్‌గా జ‌రిగిన ఎంప్లాయీస్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు.

ఇది ఉద్య‌మ ప్లాన్‌..

+ సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేయ‌కపోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆగ‌స్టు 1 నుంచి 7వ తేదీ వ‌ర‌కూ నిర‌స‌న వారోత్స వం నిర్వ‌హించున్నారు.

+ ఈ విష‌యాన్ని సంఘం అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు రామాంజ‌నేయులు యాద‌వ్‌, ప‌ఠాన్ వెల్ల‌డించారు.

+ ``క్విట్ సీపీఎస్`` పేరుతో ఆగ‌స్టు 8న శాస‌న‌స‌భ్యుల‌కు విన‌తి పత్రాలు అంద‌జేస్తారు. 15న సోష‌ల్ మీడియా ద్వారా ముఖ్య‌మంత్రి, మంత్రులు, ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని ట్యాగ్ చేస్తూ సందేశాలు పంపిస్తారు.

+ 16 నుంచి 21 వ‌ర‌కూ మ‌ధ్యాహ్నం వేళ‌ నిర‌స‌నలు చేప‌డతారు. సెప్టెంబ‌ర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో పింఛ‌ను `విద్రోహ దినం-న‌య‌వంచ‌న` స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ఉద్యోగులు నిర్ణయించారు.

జ‌గ‌న్‌కు పెరుగుతున్న షాక్‌..

`క్విట్ సీపీఎస్` నినాదంతో చేప‌డుతున్న ఉద్య‌మంలో నిగూఢ‌మైన అర్థం దాగి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వేళ ఈ హామీని నెర‌వేర్చ‌క‌పోతే .. `క్విట్` జ‌గ‌న్ అనేది ఆ నినాదంలోని ప‌ర‌మార్థంగా ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్ప టికే ఐదేళ్ల‌లో దాదాపు స‌గం ప‌రిపాల‌నా కాలాన్ని జ‌గ‌న్ పూర్తి చేసుకున్నారు. రానున్న రోజుల్లో వివిధ వ‌ర్గాల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక పోరాటాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పాల‌కుల‌పై వ్య‌తిరేక‌త పెంచ‌డంలో ఉద్యోగులు చాప కింద నీరులా.. వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.