Begin typing your search above and press return to search.
గబ్బిలాల శరీరంలో అంతుచిక్కని రహస్యాలు!
By: Tupaki Desk | 15 Dec 2020 2:00 PM ISTప్రస్తుతం శాస్త్రవేత్తలు గబ్బిలాల శరీరంపై ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇప్పటికే కరోనా సహా పలు వైరస్లు గబ్బిలాల నుంచే వచ్చాయని సైంటిస్టులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గబ్బిలాలపై పరిశోధన చేసేందుకు ఓ ప్రత్యేకమిషన్ ఏర్పాటుచేశారు. బ్రెజిల్‌కు చెందిన ఫియోక్రూజ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గబ్బిలాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. ‘గబ్బిలాలను పట్టుకోండి’ అంటూ వాళ్లు పరిశోధనలు ముమ్మరం చేశారు. గబ్బిలాలతో కరోనా వచ్చింది.. అని చెప్పేందుకు ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలు లేవు. దీంతో ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి.
మరోవైపు గబ్బిలాలతో ఇప్పటికే కొన్ని వ్యాధులు సంక్రమించాయి. అయితే భవిష్యత్‌లో మరిన్ని వైరస్‌లకు కూడా గబ్బిలాలతో సోకవచ్చని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రహస్యమేమిటంటే.. గబ్బిలాలు అసాధారణ రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. తద్వారా వాటికి ఎగిరే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది’ అని మోంటానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమాలజిస్ట్ రైనా ప్లోరైట్ పేర్కొన్నారు. ఇలా ఎగరడం వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు వాటికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వీటితో పాటు ఆ సమయంలో వాటి జీవక్రియ రేటు కూడా పదహారు రెట్లు పెరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ వ్యాధికారకాల నుంచి గబ్బిలాలకు అదనపు రక్షణ కలిగిస్తాయని రైనా ప్లోరైట్ అభిప్రాయపడ్డారు.
ఇలా వాటి రోగనిరోధక శక్తి రహస్యాలు, వాటిలో వైరస్‌ల నివాసం వంటి అంశాలను మరింత అర్ధం చేసుకునేందుకు తాజా పరిశోధన దోహదం చేస్తుందని కెనడా యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ మెక్‌మాస్టర్ పేర్కొన్నారు. తద్వారా గబ్బిలాల నుంచి మానవులకు వైరస్‌ల సంక్రమణ, చికిత్సా విధానాల వ్యూహాల్లోనూ ఈ పరిశోధనా సమాచారం దోహదపడుతుందని తెలిపారు.