Begin typing your search above and press return to search.

ఏలూరు సీన్ నెల్లూరులో రిపీట్.. వింత అనారోగ్యం

By:  Tupaki Desk   |   13 Dec 2020 9:30 AM IST
ఏలూరు సీన్ నెల్లూరులో రిపీట్.. వింత అనారోగ్యం
X
అంతుచిక్కని అనారోగ్యంతో విలవిలలాడిన ఏలూరు ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అసలేం జరిగిందన్న విషయంపై పలు పరిశోధనా సంస్థలు పరిశోధనలు జరుపుతున్నాయి. ఈ కలకలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీకి మరో షాక్ తగిలింది. ఏలూరులో ఏ రీతిలో అయితే అంతుచిక్కని అనారోగ్యం చోటు చేసుకుందో.. అదే రీతిలో నెల్లూరు జిల్లాలో వలస కూలీలు అస్వస్థతకు గురి కావటం షాకింగ్ గా మారింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 53 మంది వలస కూలీలు ఇటీవల నెల్లూరు జిల్లాలోని వెరుబొట్లపల్లికి వరినాట్ల కోసం వచ్చారు. రెండు టీంలుగా వచ్చిన వీరిలో ముగ్గురు శుక్రవారం వాంతులు.. విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. మరో ఏడుగురిలోనూ ఇలాంటి సమస్యే తలెత్తింది. ఇదిలా ఉండగా.. గోవింద్ అనే 47 ఏళ్ల వ్యక్తి మరణించారు. ఆసుపత్రిలో ఉన్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

శుక్రవారం సాయంత్రం అన్నం.. కోడిగుడ్డు.. బంగాళదుంపతో చేసిన ఆహారాన్ని తిన్నట్లుగా బాధితులు చెబుతున్నారు. నెల్లూరులో చోటుచేసుకున్న ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అధికారులుస్పందించారు. కూలీలు తాగిన బోరు నీటి నమూనాల్ని సేకరించి పరీక్షలకు పంపారు. కూలీల టీంలోని మిగిలిన వారికి పరీక్షలు జరిపారు. ఇదిలా ఉంటే.. కూలీలు బస చేసిన గదికి అనుకొని పురుగుల మందులు నిల్వ ఉంచటంతో ఆ కోణంలోనూ అధికారుల విచారణ సాగుతోంది. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఫలితాల వస్తే.. తాజా ఉదంతం వెనుక ఏముందో అర్థమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.