Begin typing your search above and press return to search.

వైసీపీలో ఖాతాలోకే ఏలూరు కార్పొరేషన్

By:  Tupaki Desk   |   25 July 2021 9:08 AM GMT
వైసీపీలో ఖాతాలోకే ఏలూరు కార్పొరేషన్
X
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది. ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఈ కార్పొరేషన్ ను సైతం అధికార పార్టీ కైవసం చేసుకుంది.

కోర్టు కేసులతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆగిపోయాయి. కొత్త ఓటర్లను చేర్చూకూడదని కేసు పెట్టిన నేపథ్యంలో కోర్టు ఈ ఎన్నికను మొదట వాయిదా వేసింది. తర్వాత ఎన్నికలు నిర్వహించాలని.. కానీ తదుపరి ఆదేశఆలు వచ్చే వరకు లెక్కింపును ఆపాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

గత మార్చిలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి.. సీఆర్ రెడ్డి కాలేజీలో ఈ బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ బందోబస్తుతో భద్రపరిచారు.

ఏలూరు కార్పొరేషన్ పై సుధీర్ఘ విచారణ తర్వాత ఓట్ల లెక్కింపునకు కోర్టు అంగీకరించింది. దీంతో ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు.

ఏలూరు కార్పొరేషన్ లోని మొత్తం 50 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా మూడు డివిజన్లను ఇప్పటికే గెలుచుకోగా.. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అధికార వైసీపీ 15 డివిజన్లను ఇప్పటికే గెలుచుకుంది. మరో 17 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

అధికార వైసీపీ ఎన్నికలు జరిగిన మార్చిలోనే మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లను రాష్ట్రంలో గెలుచుకుంది. తాజాగా మరో కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడింది.