Begin typing your search above and press return to search.

పరాగ్ అగర్వాల్ పై ఎలెన్ మస్క్ సంచలన ట్వీట్: నెట్టింట్లో రచ్చ

By:  Tupaki Desk   |   2 Dec 2021 11:41 AM GMT
పరాగ్ అగర్వాల్ పై ఎలెన్ మస్క్ సంచలన ట్వీట్: నెట్టింట్లో రచ్చ
X
ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పేరు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తాజాగా ఆయన ట్విట్టర్ సీఈవో ఒక భారతీయుడు ఎంపిక కావడంపై జీర్ణించుకోనట్లు తెలుస్తోంది. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఒక్కసారిగా తప్పుకోవడంపై ఎలెన్ మాస్క్ అదే సమాజిక వేదికగా ఓ ఫొటో పెట్టాడు. అయితే ఈ ఫొటోను చూసి ఇండియన్ నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. రీ ట్వీట్, మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. అయితే ఎప్పటికీ వివాదాల్లో అగ్గి రాజేసే ఎలెస్ మస్క్ తాజాగా ఈ ఫొటో పెట్టి ఇతరుల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఎలెన్ మస్క్ పెట్టిన ఫొటో ఎవరిది..? ఎందుకు వివాదంగా మారింది..?

ఎలెన్ మస్క్ పెట్టిన ఫొటో చాలా ఏళ్ల కింద నాటిది. ఈ ఫొటోలో యూఎస్ఎన్ఆర్ నియంత అయిన స్టాలిన్, తన కార్యదర్శి నికోలాయ్ యోజోవ్ ఓ నది వద్ద పక్కపక్కనే ఉంటారు. అయితే ఈ ఫ్రేమ్ కింద మరో ఫొటో ఉంటుంది. అందులో స్టాలిన్ మాత్రమే ఉంటాడు. నికోలాయ్ యోజోవ్ ఉండడు. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న స్టాలిన్, నికోలాయ్ మధ్య రాజకీయ పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఇద్దరు విడిపోతారు. స్టాలిన్ అండతోనే నికోలాయ్ విడిపోతాడన్నది సారాంశం. ఆ తరువాత రష్యాలో ఈ ఫొటోను సెన్సార్ చేసి నికోలాయ్ ను తొలగించారు. దీంతో ఆ ఫొటోలో స్టాలిన్ మాత్రమే ఉంటాడు.

ఈ రెండు ఫొటోలను చాలా మంది చమత్కారంగా వాడుకున్నారు. అలాంటి రాజకీయ సందర్భం ఎదురైనప్పుడు రెండింటిని సందిస్తూ వాడుకునేవారు. తాజాగా ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ విషయంలోనూ ఉపయోగించాడు. ఈ రెండు ఫొటోలను వాడాడు. అయితే స్టాలిన్ ఫేసులో పరాగ్ అగర్వాల్ మొహాన్ని పెట్టి, నికొలాయ్ ఫేసుకు సీఈవో జాక్ డోర్సేను తలను అంటించాడు. ఇంకేముందు రెండో ఫొటోలో కేవలం పరాగ్ అగర్వాల్ మాత్రమే ఉన్నాడు. డోర్సేను తీసేశాడు. అంటే పరాగ్ అగర్వాల్ డోర్సేను నదిలోకి తోసేసినట్లు ఫన్నీగా అమర్చారు. దీనిని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.

అయితే ఈ ఫొటోలపై భారతీయులు మండిపడుతున్నారు. ‘పాలిషింగ్ క్లాత్..సైబర్ విస్టల్’ అని ఫొటోలు పెట్టి ఆడుకుంటున్నారు. అలాగే ఎలెన్ మస్క్ త్వరలో సైబర్ టాయిలెట్లను ఏర్పాటు చేయబోతున్నారన్నట్లు మీమ్స్ పెట్టి రచ్చ చేస్తున్నారు. కాగా ఎలెన్ మస్క్, జాక్ డోర్సేకు ఇదివరకే స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేశారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఇప్పుడు జాక్ కోసం ఎలెన్ మస్క్ ఇలాంటి పోస్టులు పెట్టి వివాదాస్పదుడిగా మారాడు.

ఇప్పటికే పరాగ్ అగర్వాల్ విషయంలో ఎలెన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. గతంలో టెక్ రంగంలో ఉన్న గూగుల్ పెద్ద కంపెనీలు ‘యంగ్ టాలెంట్’ను తొక్కిపడేస్తున్నాయని కామెంట్లు చేశాడు. అలాగే ఇప్పుడు భారత మేధో సంపత్తి పేరుతో అమెరికా ఇతరులను అన్యాయం చేస్తూ లాభపడుతుందని అన్నారు. ఎలెన్ మస్క్ మాత్రమే కాకుండా పరాగ్ ఎంపికపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు గూగుల్, మైక్రోసాఫ్ట్ అనే పెద్ద సంస్థలకు అధిపతులుగా ఉన్న భారతీయులు ఇప్పుడు ట్విట్టర్ కు కూడా ఓ ఇండియన్ సీఈవో కావడంపై రకరకాలుగా చర్చలు పెట్టుకుంటున్నారు.