Begin typing your search above and press return to search.

మేం ప‌క్క జిల్లాకు వెళ్లి చ‌చ్చిపోతాం.. ప్లీజ్‌.. ఏలూరు ప్ర‌జ‌ల టాక్‌!!

By:  Tupaki Desk   |   24 Dec 2022 12:00 PM IST
మేం ప‌క్క జిల్లాకు వెళ్లి చ‌చ్చిపోతాం.. ప్లీజ్‌.. ఏలూరు ప్ర‌జ‌ల టాక్‌!!
X
అదేంటి అనుకుంటున్నారా? నిజ్జంగానే నిజం. మేం ప‌క్క జిల్లాల‌కు వెళ్లి చ‌చ్చిపోవాల‌ని అనుకుంటు న్నాం.. ప్లీజ్ మమ్మ‌ల్ని వ‌దిలేయండి! అని వ‌యో వృద్ధులు మొర పెట్టుకుంటున్నారు. దీనికి కార‌ణం.. వారిని వారి బంధువులు, క‌న్న‌వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం కాదు..మ‌రింత‌గా వారిపై ప్ర‌భుత్వం భారం మోప‌డ‌మేన‌ని చెబుతున్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశానాల్లో దహన సంస్కారాలకు 5 వేల రూపాయల చొప్పున వసూలు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందులోనే కట్టెలు, డీజిల్, పెట్రోల్ లాంటి ఖర్చులు ఉండనున్నాయి.

సర్వసభ్య సమావేశ ఎజెండాలో శవ దహనానికి రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. పేద, ధనిక అనే సంబంధం లేకుండా... చనిపోయిన వ్యక్తి సంస్కారాలకు కుటుంబసభ్యులకు ఇకపై రుసుము చెల్లించాలి.

ఇప్పటిదాకా వివిధ రకాల పౌరసేవలకు డబ్బులు వసూలు చేస్తూ ధనార్జనకు అలవాటు పడిన పట్టణ స్థానిక సంస్థలు.. చివరికి దహన సంస్కారాలకూ రూ.5వేల చొప్పున నిర్ణ‌యంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతు న్నారు.

ప‌నిగ‌ట్టుకుని రూ.5 వేలు శ‌వాల ద‌గ్గ‌ర వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించుకుంటే.. కాటికాప‌రుల‌కు ఎంతివ్వాలి.. శ‌వాన్ని తీసుకువ‌చ్చిన మార్చురీ వ్యాన్ కు ఎంత క‌ట్టాలి. పాడె ఖ‌ర్చులు... పువ్వుల ఖ‌ర్చులు.. వాటికి ఎంత అవ్వాలి.. అని నిల‌దీస్తున్నారు.

క‌నీసం.. ప్ర‌జ‌ల చావుల పై సానుభూతి చూప‌కుండా.. వాటి నుంచి కూడా డ‌బ్బులు పిండుకుంటే.. ఇక‌, ఇక్క‌డ ఉండి ఎందుకు? అని వ‌యోవృద్ధులు విల‌పిస్తున్నారు. అందుకే పొరుగు జిల్లాల‌కు వెళ్లిపోతామ‌ని అంటున్నారు. ఇదీ.. ఇప్పుడు ఏపీలో ప‌రిస్థితి. మ‌రోవైపు.. ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు మాత్రం 'ప్ర‌భుత్వ‌మే ఆదాయ మార్గాలు వెతుక్కోమంది'' అని తాపీగా సెల‌విస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.