Begin typing your search above and press return to search.

ఎంపీటీసీ - జడ్పీటీసీ పోటీకి నిబంధనలివీ?

By:  Tupaki Desk   |   12 Jan 2020 5:52 AM GMT
ఎంపీటీసీ - జడ్పీటీసీ పోటీకి నిబంధనలివీ?
X
ఏపీలో పరిషత్ ఎన్నికల నగారా మోగుతోంది. అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీ మధ్యే ఈ పోరు సాగనుంది. ఈనెల 17లోపు సంక్రాంతి పండుగ సందర్భంగా నోటీఫికేషన్ వెలువడే అవకాశం ఉందట.. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటోంది. అయితే వందలాది మంది ఎంపీటీసీ - జడ్పీటీసీ - జడ్పీ చైర్మన్ - ఎంపీపీ ఆశావహులు దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు ఏంటీ అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

+ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసిన నిబంధనలు ఇవే..

*జడ్పీటీసీకి పోటీచేయాలంటే నిబంధనలు

జడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థులు జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఏ మండలం నుంచైనా పోటీచేయవచ్చు. ఒక వ్యక్తి ఒక్క సీట్లోనే పోటీచేయవచ్చు.

*ఎంపీటీసీకి పోటీచేయాలంటే?

ఎంపీటీసీగా పోటీచేయాలంటే ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండలంలోని ఏ గ్రామంలోనైనా పోటీచేయవచ్చు.

*ఇక మండల - జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీచేయడానికి కనీస వయసు 21 ఏళ్లు. నాలుగు సెట్ల దరఖాస్తులు మించి దాఖలు చేయవద్దు..

*ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు - డైరెక్టర్లు - ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు - గ్రామ సేవకులు పోటీచేయడానికి అనర్హులు.

*లంచాలు - అవినీతి కేసుల్లో వెనుకబడ్డవారు.. విధుల నుంచి సస్పెండ్ అయిన ఉద్యోగులు ఐదేళ్ల కాలపరిమితి వరకూ పోటీచేయకూడదు.

*నేరాల్లో శిక్ష పడ్డ వారు సైతం శిక్ష ముగిసిన తర్వాత ఐదేళ్ల వరకూ పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులు.

*1995 - మే31 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు

*ఎస్సీ - ఎస్టీ - బీసీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలపై గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలి.

*జిల్లా పరిషత్ కు పోటీచేయడానికి డిపాజిట్ గా 5వేలు. ఎస్సీ - ఎస్టీ - బీసీలు రూ.2500 చెల్లించాలి. మండలపరిషత్ కు పోటీచేసే వారు రూ.2500 చెల్లించాలి. ఎస్సీ - ఎస్టీ - బీసీలకు రూ.12500 మాత్రమే చెల్లించాలి

*అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం బ్యాంకులో ప్రత్యేక ఖాతా తీయాలి. ఈ ఖాతానుంచే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి.