కేంద్రం వెనకడుగు వేసిందే

Thu Jul 07 2022 11:00:01 GMT+0530 (IST)

electricity bill on farmers

వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించే విషయంలో కేంద్రప్రభుత్వం వెనకడుగువేసింది. వ్యవసాయరంగంలో వినియోగిస్తున్న విద్యుత్ పై పక్కా లెక్కల కోసమే కేంద్రప్రభుత్వం మోటార్లకు మీటర్లను బిగించాలని అనుకున్నది.విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో అప్పట్లో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దేశంలో మెజారిటి రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉండటంతో చాలా రాష్ట్రాల్లో ఈ సంస్కరణలు అమల్లోకి వచ్చింది.

ఇందులో భాగంగానే ఏపీలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఏపీలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ టీడీపీలు మద్దతిచ్చాయి. దాంతో ఏపీలో కూడా సంస్కరణలు అమల్లోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ముందు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నది. ఈ జిల్లాలో సక్సెస్ అయ్యిందని ప్రభుత్వం అనుకున్న తర్వాత రాష్ట్రమంతా అమలుచేయాలని అనుకున్నది.

అన్నీ జిల్లాల్లో అమలుచేసేందుకు ప్రభుత్వం ఒకవైపు ప్రణాళికలు రెడీచేసుకుంటోంది. సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రం వెనకడుగువేసింది. పోయిన సంవత్సరం విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లులో మోటార్లకు మీటర్లు బిగించాలనే క్లాజును తొలగించింది. వ్యవసాయ మోటార్లకు కరెంటు సరఫరాచేసే ట్రాన్స్ ఫార్మర్ల దగ్గరే మీటర్లు బిగించి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించాలన్నది కేంద్రం ఆలోచన. అయితే చాలా రాష్ట్రాల్లో రైతులు ముఖ్యంగా నాన్ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి.

విద్యుత్ చట్ట సవరణ బిల్లులో మార్పులుచేసి తొందరలో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యింది. నిజానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటం మంచిదే. ఎందుకంటే వ్యవసాయరంగంలో రోజుకు ఎంత విద్యుత్ వాడుతున్నరన్నది కచ్చితమైన లెక్క తెలుస్తుంది. ఇపుడు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆ ఇచ్చేదానికి కూడా లెక్కుండాలి కదా.

వ్యవసాయేతర రంగాల్లో ఎంత విద్యుత్ వాడుతున్నది సరైన లెక్కలున్నపుడు వ్యవసాయరంగంలో వాడే విద్యుత్ కు మాత్రం లెక్క ఎందుకు ఉండకూడదు ? కచ్చితమైన లెక్కలు రావాలంటే మీటర్లుండాల్సిందే. కానీ వ్యతిరేకత కారణంగా కేంద్రమే వెనకడుగువేసింది.