Begin typing your search above and press return to search.
ఎలక్ట్రిక్ లూనా వచ్చేసిందోచ్
By: Tupaki Desk | 26 Aug 2021 5:00 AM ISTరోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్‌పై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దాంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఈ అవసరాలు, డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలకు తగ్గట్లు కైనెటిక్ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ మళ్లీ ఇండియాలో న్యూ వెహికల్స్ తీసుకొస్తుంది. మరికొన్ని రోజుల్లో తన ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేయబోతున్నది.
పాత ఫ్యాషన్ ల్యూనా మోపెడ్‌ను ఎలక్ట్రిక్ హంగులతో తీసుకొస్తోంది ‘కైనెటిక్’ కంపెనీ. తద్వారా పాత ఫీచర్లన్నీ అందజేయబోతున్నది. ఈ ఏడాదిలోనే ‘కైనెటిక్ మోపెడ్’ లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఈ మోపెడ్‌కు అదిరిపోయే, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బ్యాటరీని సెట్ చేసింది కంపెనీ. ఈ కారణంగానే ఈ మోపెడ్‌ను ప్రజలు ఎక్కువగా కొనుగులో చేసే అవకాశాలుంటాయని కంపెనీ భావిస్తోంది. తొంభైలలో యాభై సీసీ కైనెటిక్ మోపెడ్ ఇండియాలో బాగా పాపులర్ వెహికల్ అని మనకు తెలుసు.
అప్పట్లో సైకిల్ కొనుక్కోవాలి అనుకునే చాలా మంది మరిన్న డబ్బు పోగెసుకుని మరి మోపెడ్ కొనుగోలు చేసేవారట. అలా స్కూటర్ కావాలి అనుకునేవారు అంతా డబ్బు లేక మోపెడ్ కొనుక్కొని హ్యాపీగా ఫీలయ్యేవారు. అయితే, 2000 సంవత్సరం తర్వాత ఈ కంపెనీ మోపెడ్ల ఉత్పత్తిని నిలిపేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ ల్యూనాను తీసుకొస్తుంది. ఇందులో పాత మోపెడ్ ఫీచర్స్ చాలా వరకూ ఉంటాయట. కొత్త కైనెటిక్ ల్యూనాకి 1 వాట్ మోటర్ ఉండగా, దీన్ని ఫుల్లుగా చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దాకా బండి వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు.
ఈ మోపెడ్ మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు . అయితే, దీనికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే..ఈ వెహికల్ నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ మోపెడ్‌కు సరికొత్తగా ఎల్‌ఈడీ లైట్స్ అమర్చారు. ఈ వెహికల్‌ను అందరికీ అవెయిలబుల్‌గా ఉండే ప్రైస్‌లోనే తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు కంపెనీ నిర్వాహకులు. ప్రస్తుతానికి ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలపలేదు. త్వరలోనే ధర తెలిసే చాన్సెస్ ఉన్నాయి. ఇక జనంలోనూ గతంతో పోల్చితే కొంత అవేర్‌నెస్ పెరిగినట్లు పలు అధ్యయనాలు తెలిపాయి.
జనాలు పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండేందుకుగాను ప్రత్యామ్నాయ పద్ధతులు వైపు మొగ్గుచూపేందుకు కొంత శాతమైన మందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ వెహికల్స్ వాడటం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవడంతో పాటు ఎన్విరాన్‌మెంట్‌కు ఎటువంటి నష్టం కలగదు. అయితే, ప్లాస్టిక్ వినియోగంపైన ఆంక్షలు విధించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. అయితే, ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు అంత త్వరగా ప్లాస్టిక్‌ను వదిలేసే చాన్సెస్ ఉండవు.
ఎందుకంటే అది మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఓన్లీ పవర్ మాత్రమే కంజ్యూమ్ అవుతుంది. పవర్ ఆధారంగా వెహికల్స్ చక్కగా నడుస్తుంటారు. సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ జనాల్లో పెరగడం పట్ల పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వెహకల్స్‌దేనని పేర్కొంటున్నారు.