Begin typing your search above and press return to search.

రాజీనామా చేస్తా.. న‌న్ను శిక్షించండి!

By:  Tupaki Desk   |   9 May 2021 4:42 AM GMT
రాజీనామా చేస్తా.. న‌న్ను శిక్షించండి!
X
దేశంలో క‌రోనా ఈ స్థాయిలో విజృంభించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు కూడా ఒక‌ట‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించి, ఇంత‌టి మార‌ణ‌హోమం పెర‌గ‌డానికి కార‌ణ‌మైన ఎన్నిక‌ల సంఘంపై హ‌త్య కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి కార‌ణాలు ఏంటో తెలిపిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి కొన్ని ద‌శ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని అనుకున్నామ‌ని, కానీ.. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడితే.. ఎన్నిక‌ల సంఘంపై విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌నే ఉద్దేశంతోనే పూర్తిచేశామ‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా.. ఒక పార్టీకి అనుకూలంగా, మ‌రో పార్టీకి వ్య‌తిరేకంగా వాయిదా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అంటార‌నే ఎన్నిక‌లు పూర్తిచేశామ‌ని ఆయ‌న తెలిపిన‌ట్టు స‌మాచారం. అందువ‌ల్ల ఎన్నిక‌ల సంఘంపై చేసిన ఘాటు వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా బాధ్యున్ని చేయాల‌ని రాజీవ్ కోర్టును కోరిన‌ట్టుగా తెలుస్తోంది.

న్యాయ‌స్థానం వ్యాఖ్య‌లు తీవ్రంగా ఆవేద‌న క‌లిగించాయ‌ని అన్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల సంఘంపై ప‌డిన మ‌చ్చ‌ను తొల‌గించాల్సి ఉంద‌న్నారట‌. అవ‌స‌ర‌మైతే త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా శిక్షించినా ప‌ర్వాలేద‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.