Begin typing your search above and press return to search.

ఆధార్‌ తో బోగ‌స్ ఓట్ల‌కు చెక్‌... ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   16 Aug 2019 12:59 PM GMT
ఆధార్‌ తో బోగ‌స్ ఓట్ల‌కు చెక్‌... ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
ఎన్నికల సంఘం ఎన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకున్న ఓటరు కార్డుల్లో అవకతవకలని పూర్తిగా అరికట్టలేకపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఎన్నికల సమయానికి చాలా బోగస్ కార్డులు బయటపడుతూనే ఉన్నాయి. గ‌త డిసెంబ‌ర్‌ లో తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ల‌క్షలాది ఓట్లు గ‌ల్లంత‌వ్వ‌గా...అలాగే ఎన్నిక‌లు జ‌రిపించేసిన ఈసీ అభాసుపాలైంది. ఈ విష‌యంలో ఈసీ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా మళ్ళీ ఎన్నికలు జరిగే స‌మ‌యానికి బోగస్ కార్డులు బయటపడుతూనే ఉంటాయి. అయితే ఈ బోగస్ కార్డులని ఏరిపారేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

మొబైల్ నెంబర్ కు ఆధార్ ఎలా అయితే లింక్ చేశామో, ఇప్పుడు అలాగే ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌ తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయ శాఖకు ఈసీ లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్‌ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు, బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది. ఇక ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరినీ ఒక్క ఓటు మాత్రమే పరిమితం చేయవచ్చని చెబుతోంది.

అయితే గతంలో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంలో బలవంతం ఏమి లేదని, నచ్చినవారు లింక్ చేసుకోవచ్చని చెప్పింది. కానీ ఇప్పుడు ఓటర్ కార్డు తప్పనిసరిగా ఆధార్ కు లింక్ చేయాలని కోరుతోంది. కాగా ఇప్పటికే 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి. ఇక ఈ అంశంపై ఈసీ న్యాయశాఖకు లేఖ రాయడం ఇదే తొలిసారి. ఈ లింకింగ్ తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయాలని కూడా ఈసీ న్యాయ శాఖకు ప్రతిపాదించింది.

ఇక కేంద్ర ప్ర‌భుత్వం కొద్ది రోజుల క్రితం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లో పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డును ఆప్ష‌న్‌ గా ప్ర‌వేశ‌పెట్టి... ఆధార్‌ కు ప్రాధాన్యం పెంచింది. తాజాగా ఈసీ కూడా ఇప్పుడు ఆధార్‌కు ఓట‌రు గుర్తింపు కార్డుకు లింక్ పెట్ట‌డంతో ఫ్యూచ‌ర్‌ లో ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు లేకుండా మ‌రింత క‌ట్టుదిట్టంగా జ‌ర‌గ‌నున్నాయి.