Begin typing your search above and press return to search.

వేలి మీద ఓటు గుర్తుకు మార్కర్లు..?

By:  Tupaki Desk   |   23 Nov 2015 4:03 AM GMT
వేలి మీద ఓటు గుర్తుకు మార్కర్లు..?
X
ఎన్నికల సమయంలో ఓటు వేసే ఓటరుకు.. ఓటు వేశారన్న దానికి గురుతుగా చేతి వేలు మీద ఇంకు చుక్కను వేయటం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే మాత్రం అలాంటి విధానానికి త్వరలోనే స్వస్తి పలకొచ్చన్న మాట వినిపిస్తోంది. దాదాపుగా 52 సంవత్సరాలు పైగా ఓటు వేసినప్పుడు చేతి వేలికి ఇంకు చుక్కను వేస్తున్నారు. అయితే.. తాజాగా వస్తున్న మార్పులు.. యువ ఓటర్ల నుంచి వస్తున్న వినతులతో ఎన్నికల సంఘం.. ఇంకు వినియోగానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

ఇంకు బాటిళ్లను వినియోగించటం.. వాటిని దాచి పెట్టటం.. వాటిని తరలించటం లాంటివి కష్టతరంగా మారటంతో పాటు.. ఇంకును వినియోగించే విషయంలో దొర్లుతున్న లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంకుకు బదులు మార్కర్లు వాడాలన్న సూచన వ్యక్తమవుతోంది. ఈ సూచనపై ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి సారించింది.

ఇంకుబాటిళ్ల వినియోగం కష్టంగా.. క్లిష్టంగా మారిన నేపథ్యంలో అందుకు భిన్నంగా.. మార్కర్ తో వేలి మీద గురుతు వేయటం చాలా సులువున్న సూచనకు ఎన్నికల సంఘం సానుకూలంగా ఉంది. అయితే.. దీని సాధ్యాసాధ్యాలతో పాటు.. అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే.. ఇప్పటివరకూ ఎన్నికల్లో కనిపించే ఇంకు డబ్బా అదృశ్యం కావటం ఖాయమంటున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.