Begin typing your search above and press return to search.
‘చంద్రగిరి’పై ఎన్నికల కమీషన్ విచారణ
By: Tupaki Desk | 2 Nov 2020 8:30 AM ISTఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికపై వివాదాలు చెలరేగాయి. చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో వైసీపీ తరుఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ తరుఫున పులివర్తి నాని పోటీచేశారు. ఈ ఎన్నికల్లో చెవిరెడ్డి ఘన విజయం సాధించారు.
అయితే వైసీపీ కొన్ని చోట్ల రిగ్గింగుకు పాల్పడిందని ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఆరోపించారు... ఎస్సీ, బీసీలను టీడీపీ నేతలు బెదిరించి రిగ్గింగ్ చేశారని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను సైతం చెవిరెడ్డి ఈసీకి సమర్పించారు. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ మళ్లీ ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది. ఆ తర్వాత అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి.
తాజాగా ఈ ఎన్నికపై విచారణ మొదలుపెట్టిన ఎన్నికల కమిషన్ అధికారి శ్రీధర పోలింగ్ ఫుటేజీలను పరిశీలించారు. 25మంది రౌడీషీటర్లు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగుకు పాల్పడినట్టు విచారణ అధికారి గుర్తించినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉండాల్సిన రౌడీషీటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా వచ్చారనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ , రిటర్నింగ్ అధికారి ప్రద్యుమ్మపైన కూడా వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై విచారణ అధికారి శ్రీధర్ విచారణ జరిపినట్టు సమాచారం. దీంతో ఆయన సిఫారసుల ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డ వారిపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.