Begin typing your search above and press return to search.

స్థానిక సంస్థలపై తప్పుడు ప్రచారంపై ఈసీ అధికారుల ఫిర్యాదు

By:  Tupaki Desk   |   6 Sept 2020 5:40 PM IST
స్థానిక సంస్థలపై తప్పుడు ప్రచారంపై ఈసీ అధికారుల ఫిర్యాదు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈ తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం అధికారులు విజయవాడ సీపీ, సత్యనారాయఫురం సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందని నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.దీంతో ఏపీ వ్యాప్తంగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఇటు ప్రభుత్వం కానీ.. అటు ఎన్నికల సంఘం కానీ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో ఇలా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కరోనా తీవ్రతతో ఇప్పటికే స్థానిక ఎన్నికలను ఇప్పటికే ఈసీ వాయిదా వేసింది. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలంటూ షెడ్యూల్ ప్రచారంలోకి రావడంపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.

ఈ తరహా తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘం అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం ఎవరు చేస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.