Begin typing your search above and press return to search.

లోకేశ్‌ కి మొగుడు చంద్రబాబు.. చంద్రబాబు భర్త ఖర్జూరనాయుడు

By:  Tupaki Desk   |   24 March 2019 7:28 AM GMT
లోకేశ్‌ కి మొగుడు చంద్రబాబు.. చంద్రబాబు భర్త ఖర్జూరనాయుడు
X
చంద్రబాబునాయుడు, లోకేశ్‌ లు చిన్నచిన్న పొరపాట్లతో నెటిజన్లకు టార్గెట్‌ గా మారుతుంటారు. తాజా మరోసారి అలాంటి పరిస్థితే వారికి ఎదురైంది. ఈసారి ఎన్నికల నామినేషన్ల సందర్భంగా సమర్పించిన పత్రాలు దొర్లిన పొరపాట్లు వారిపై కావాల్సినన్ని సెటైర్లు పడేలా చేస్తున్నాయి. చంద్రబాబు విషయంలో ఇలాంటి పొరపాట్లు తక్కువే అయినా లోకేశ్ మాత్రం పొరపాట్లకు మారుపేరే అని చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సానుభూతి తెలిపే క్రమంలో 'పరవశించిపోయాం' అనే పదం వాడి అడ్డంగా బుక్కయ్యారు లోకేశ్. అంతేకాదు.. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం పేరును తప్పుగా చెప్పడంతో పాటు ఎన్నికల తేదీని కూడా తప్పుగా చెప్పిన ఘనత లోకేశ్ బాబుది. ఇప్పుడు ఏకంగా నామినేషన్ సమయంలో సమర్పించిన ఓ ధ్రువపత్రంలో తండ్రి చంద్రబాబు అని రాయాల్సింది పోయి భర్త చంద్రబాబు అని పేర్కొని నవ్వుల పాలవుతున్నారు.

టీడీపీ తరుపున మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నామినేషన్లు వేశారు. అందులో తప్పులు దొర్లాయి. నామినేషన్ పత్రాలతో పాటు.. తమ ఓటు ఎక్కడుందో తెలిపే అధికారిక పత్రాన్ని కూడా నామినేషన్ పత్రాలతో సమర్పించారు. అందులో నారా లోకేశ్ భర్త పేరు నారా చంద్రబాబు నాయుడంటూ ప్రింట్ చేసి ఉంది. చంద్రబాబునాయుడు భర్త పేరు ఖర్జూర నాయుడు అంటూ ప్రింట్ చేసి ఉంది. అయితే.. అధికారులు కూడా కనీసం దాన్ని చూడకుండానే సంతకాలు చేయడం గమనార్హం. ఈ పత్రాలు ఇప్పుడు వాట్సాప్‌ లో తెగ షేర్ అవుతున్నాయి.

అయితే.. ఈ పొరపాటు చంద్రబాబు, లోకేశ్‌ లు చేసిందేమీ కాదు. అధికారులు చేసిన పొరపాటు వల్ల ఈ తప్పిదం జరిగింది. చంద్రబాబు, లోకేశ్‌ లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో జతపర్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం మంజూరుచేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద హజ్బండ్ అని ఉంది. దీన్ని గమనించకుండానే అధికారులు అక్కడ తండ్రి పేర్లు రాసి సంతకం చేసి ధ్రువపత్రం జారీ చేశారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉన్న పొరపాటును అధికారులు గుర్తించి కొత్తగా ధ్రువపత్రాలు మంజూరు చేశారు.