Begin typing your search above and press return to search.

మే 27న ఓటీటీలోకి ''ఏక్ మినీ కథ''..?

By:  Tupaki Desk   |   17 May 2021 4:45 PM GMT
మే 27న ఓటీటీలోకి ఏక్ మినీ కథ..?
X
సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ - శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ''ఏక్ మినీ కథ''. ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. దీనికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో 'ఏక్ మినీ కథ' మూవీని విడుదల చేయనున్నట్లు సమాచారం.

కరోనా నేపథ్యంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ చేసినా ఫుల్ కెపాసిటీకి అనుమతులు ఉండకపోవచ్చు. అంతేకాక ఈసారి ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్ళడానికి ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ ప్రత్యామ్నాయంగా ఓటీటీ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపిన యూవీ క్రియేషన్స్ వారు.. ప్రస్తుత పరిస్థితులు చూసి చివరకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకున్నారని ఓటీటీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మే 27న ఈ చిత్రాన్ని ప్రైమ్ లో విడుదల చేయనున్నారని అంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా, 'ఏక్ మినీ కథ' చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్1సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇందులో బ్రహ్మాజీ - సుదర్శన్ - సప్తగిరి - హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.