Begin typing your search above and press return to search.
ఐన్‌స్టీన్ భార్య రాసిన ఓ ఉత్తరం బయటపడింది.. ఆ లెటర్లో ఏముందంటే?
By: Tupaki Desk | 4 March 2021 5:00 AM ISTఎప్పుడో వందేళ్ల క్రితం రాసిన ఓ ఉత్తరం ఇప్పుడు బయటకొచ్చింది. ఆ లెటర్‌ను ఐన్‌స్టీన్ భార్య తన కజిన్‌కు రాశారు. ఈ ఉత్తరంలో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ఐన్‌స్టీన్ ఓ శాస్త్రవేత్త మాత్రమే కాదని.. ఆయనలో ఓ కాలజ్ఞుడు (భవిష్యత్‌ను ఊహించేవాడు) కూడా ఉన్నారని ఆయన భార్య ఆ ఉత్తరంలో రాశారు.
ఐన్‌స్టీన్ మొదటి భార్య 1919 వ సంవత్సరంలో చనిపోయారు. అయితే కుటుంబసభ్యులు, బంధువుల సూచనతో ఆయన తనకంటే మూడేళ్ల ఎక్కువ వయస్సు ఉన్న ఎల్సాను వివాహం చేసుకున్నాడు. ఎల్సాతో పెళ్లి జరిగినప్పుడు ఐన్‌స్టీన్ వయసు 40 ఏళ్లు.. ఎల్సా వయస్సు 43 ఏళ్లు. అయితే ఎల్సా ఐన్‌స్టీన్‌కు ఓ సలహాదారుగా కూడా వ్యవహరించేవారు.
ఆమె నిత్యం ఐన్‌స్టీన్ గేట్ దగ్గర కూర్చొనేవారు. ఆ రోజుల్లో ఐన్‌స్టీన్‌ను చూడటానికి చాలా మంది వస్తుండేవారు. అయితే ఆయన మాత్రం తన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పరిశోధనలో నిమగ్నం అయి ఉండేవాడు. దీంతో ఆయన పరిశోధనకు అంతరాయం కలుగకూడదని అటువంటి వాళ్లను ఆమె లోపలికి రానిచ్చేవారు. ఇదిలా ఉంటే ఎల్సా రాసిన లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఐన్‌స్టీన్ గురించి వివరిస్తూ ఎల్సా తన కజిన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘ఐన్‌స్టీన్‌ను చాలా మంది భౌతికశాస్త్రవేత్త అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయనలో చాలా కోణాలు ఉన్నాయి. ఆయన ఓ కాలజ్ఞుడు. భవిష్యత్ ను ముందే ఊహించేవాడు. హిట్లర్ జైలు నుంచి విడుదలయ్యాక.. యూధులను ఊచకోత కోస్తాడని ఐన్‌స్టీన్ ముందే ఊహించాడు.
అంతేకాక ఆయన అధికారం చేపడతాడని కూడా ఐన్‌స్టీన్ ఊహించాడు. ఈ విషయాన్ని ఐన్‌స్టీన్ నాతో చెప్పారు’ అని ఆమె లెటర్ లో పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఐన్‌స్టీన్‌కు సొంతంగా ఇళ్లు కూడా ఉండేది కాదట. దీంతో ఎల్సా దగ్గరుండి మరి ఐన్ స్టీన్ కోసం ఇళ్లు కట్టించిదట. ఇలా ఆమె పలు విషయాల ను ఈ లేఖ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనం గా మారింది.