Begin typing your search above and press return to search.

జాక్వెలిన్ పై ఈడీ సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   23 Oct 2022 10:07 AM IST
జాక్వెలిన్ పై ఈడీ సంచలన ఆరోపణలు
X
సుకేష్ చంద్రశేఖర్‌పై 200 కోట్ల దోపిడీ కేసు కొత్త మలుపులు తిరిగింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని.. దేశం నుండి పారిపోవాలని కూడా ప్లాన్ చేశారని ఈడీ ఆరోపించింది.

ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. జాక్వెలిన్ తన సెల్ ఫోన్ నుండి డేటాను తొలగించడం ద్వారా విచారణ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసిందని ఈడీ ఆరోపించింది. జాక్వెలిన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిందని, అయితే ఆమె పేరు 'లుకౌట్ సర్క్యులర్'లో ఉన్నందున అది చేయలేకపోయిందని ఈడీ ఆరోపించింది, ఇది భారతదేశం నుండి పారిపోవాలనుకునే వ్యక్తుల జాబితాలో జాక్వెలిన్ పేరు ఉండడంతోనే ఆమెకు సాధ్యపడలేదని వివరించింది.

ఈడీ లేవనెత్తిన మరో పాయింట్‌లో ఈ కేసులో ఇతర నిందితులతో ముఖాముఖి కూర్చున్నప్పుడు జాక్వెలిన్ విచారణకు సహకరించలేదని ఆరోపించారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌తో సహా పలువురిని డబ్బు కోసం మోసం చేసి జైలుకెళ్లిన సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ,నోరా ఫతేహిలు లగ్జరీ కార్లు మరియు అనేక ఇతర ఖరీదైన బహుమతులు అందుకున్నారని ఈడీ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

-జాక్వెలిన్ బెయిల్ విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది.
సుకేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా జాక్వెలిన్ తప్పు లేదని ఈడీకి లేఖ పంపారు. ఆ బహుమతులను స్వీకరించడం ఆమె తప్పు కాదని, అలాగే ఆ బహుమతుల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా చట్టబద్ధమైన ఆదాయ వనరుల ద్వారా తాను సంపాదించానని సుకేష్ చెప్పాడు. పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్) కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా చేర్చడం చాలా చాలా అదృష్టమని సుకేష్ రాశాడు. మేము ఒక సంబంధంలో ఉన్నామని.. నేను ఆమెకు, ఆమె కుటుంబానికి బహుమతులు ఇచ్చినట్లయితే, వారి తప్పు ఏమిటి... ఆమెను ప్రేమించడం .. ఆమెకు అండగా నిలవడం తప్ప ఆమె నన్ను ఎన్నడూ ఏమీ అడగలేదని సుఖేష్ ఈడీకి కోర్టుకు విన్నవించారు.