Begin typing your search above and press return to search.

ఈడీ విచార‌ణః షారుక్‌కు చుక్క‌లు

By:  Tupaki Desk   |   12 Nov 2015 12:02 AM IST
ఈడీ విచార‌ణః షారుక్‌కు చుక్క‌లు
X
బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చుక్క‌లు చూపించింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆర్థిక వ్యవహారాల్లో విదేశీ నిధులను ఫెమా నిబంధన‌లు ఉల్లంఘించి సేక‌రించారని షారూక్‌కు ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులిచ్చింది. అయినా షారూక్ విచారణకు హాజరు కాలేదు. దీంతో మూడో ద‌ఫా ఈడీ తాఖీదు జారీచేయ‌డంతో తాజాగా హాజ‌ర‌య్యారు. దాదాపు మూడు గంటలకు పైగా ఈడీ అధికారులు షారూఖ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని అయిన షారూఖ్ ను ఈడీ ప్రశ్నించడం ఇది తొలిసారి కాదు. గ‌తంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సైతం ఈడీ ద‌ర్యాప్తు చేసింది. విచార‌ణ అనంత‌రం షారుక్ మీడియాతో మాట్లాడుతూ....ఈడీ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పాన‌ని సింపుల్‌గా స్పందించి ముగించారు.