Begin typing your search above and press return to search.

ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే

By:  Tupaki Desk   |   28 July 2022 5:11 AM GMT
ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే
X
ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే. ఎక్కడ వెతికినా కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. డబ్బే కాదు బంగారం, కట్టల కొద్దీ డాలర్లు కూడా బయటపడుతున్నాయి. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడంటే కోల్ కత్తాలోని అర్పిత ముఖర్జీది.

నాలుగు రోజుల క్రితం బెంగాల్ పరిశ్రమల శాఖ మంత్రి పార్ధా చటర్జీతో పాటు అరెస్టయిన సినీనటి, మంత్రి సహచరురాలు గుర్తుంది కదా. అప్పట్లోనే ఆమె ఇంట్లో రు. 21 కోట్ల బయటపడింది. దాంతో డబ్బుతో పాటు ఆమెను కూడా ఈడీ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మూడు రోజుల విచారణ తర్వాత మరోసారి ఆమె ఇంటిని ఈడీ ఉన్నతాధికారులు ఓపెన్ చేసి సోదాలు చేశారు. రెండోసారి మరో 23 కోట్లు బయటపడ్డాయి. ఇందులో రు. 21 కోట్ల డబ్బు, రు. 2 కోట్లు విలువైన బంగారు నగలతో పాటు డాలర్ల కట్టలు బయటపడ్డాయి.

రెండోసారి కూడా ఇంతడబ్బు బయటపడటంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు.ఈ సారి సోదాల్లో ఈమెకే మరో ఇల్లున్న విషయం బయటపడింది. వెంటనే ఆ ఇంటికి వెళితే తాళం లేకపోవటంతో ఏమీ చేయలేకపోయారు.

రెండోసారి బయటపడిన డబ్బు, బంగారం, డాలర్లను ముఖర్జీ ఒక రహస్య లాకర్లో దాచిపెట్టారు. ఇలాంటి లాకర్లు ఇంకా ఎన్ని ఉన్నాయనే విషయాన్ని అధికారులు అంగుళం అంగుళం వెతుకుతున్నారు. తాళం తెరవని ఇంట్లోలోకి వెళ్ళి వెతికితే కానీ అక్కడెంత డబ్బు, బంగారం ఉందో తెలీదు. ఇప్పటికైతే తలుపులు బద్దలు కొట్టడం ఎందుకని తాళంకోసం వెతుకుతున్నారు. తప్పదంటే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలకు వెళ్ళటం ఖాయం.

ఇంటి విషయం బటయపడగానే దాని తాళం కనబడటం లేదని ముఖర్జీ చెప్పిందంటేనే ఇపుడు బయటపడిందానికన్నా ఇంకా ఎక్కువగానే ఉండచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి మంత్రి పార్థా చటర్జీ చేతివాటం బాగా పెద్దదనే అర్ధమవుతోంది. తనింటిని మంత్రి ఓ బ్యాంకులాగ వాడుకున్నారని స్వయంగా ముఖర్జీయే చెప్పిందంటే ఇపుడు దొరికింది చాలా తక్కవనే అనిపిస్తోంది. ఇలాంటి ముఖర్జీలు చటర్జీకి ఇంకా ఎంతముందున్నారో బయటపడాల్సుంది.