Begin typing your search above and press return to search.
యూకేలో ఆర్థికవ్యవస్థ పతనం..300 ఏళ్లు వెనక్కి!
By: Tupaki Desk | 28 Nov 2020 9:30 AM ISTకరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అభివృద్ధి చెందుతున్నదేశాలే కాకే.. అగ్రదేశాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. కోలుకోవడానికి కూడా కరోనా మహమ్మారి అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ప్రభావం వల్ల భారత్ లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జూన్ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు కూడా పడిపోయింది. మైనస్ 23.9 శాతానికి దిగజారింది. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. యూకేలో గత 300 ఏళ్లలో ఎప్పుడూ ఇంత నష్టం జరగలేదని చాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ రిషి సునక్ అన్నారు.
తమ దేశంలో కరోనా ఎఫెక్ట్‌తో భారీగా ఖర్చులు తగ్గించుకున్నామని చెప్పారు. ఉద్యోగులకు వేతనాల్లో భారీగా కోతలు విధించామని చెప్పారు. యూకేలో నిరుద్యోగం మరింతగా 7.5 శాతం పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యూకేలో ఇంతవరకు హెల్త్‌ఎమర్జెన్సీ ముగియలేదని రిషి సునక్ చెప్పారు. ఇప్పడిప్పుడే ఎకనమిక్ ఎమర్జెన్సీని కూడా ప్రారంభించామన్నారు.
యూకేలో ప్రజలకు జీవనోపాధి కల్పించడం.. మౌలిక వసతులు అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకోసం అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామని చెప్పారు. బ్రిటన్‌లో ద్రవ్యలోటు పెరిగిపోయిందని చెప్పారు. ఇందుకోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 1709లో తర్వాత మళ్లీ ఇప్పుడు ఇటువంటి ఆర్థికమాంద్యం వచ్చిందని ఆయన చెప్పారు. దేశాన్ని ఆర్థికంగా మెరుగుపరిచేందుకు మరిన్న కఠిననిర్ణయాలు తీసుకుంటామన్నారు.