Begin typing your search above and press return to search.

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై ఈసీ ప్రకటన

By:  Tupaki Desk   |   4 Sep 2021 9:44 AM GMT
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై ఈసీ ప్రకటన
X
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికలు సంఘం పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు నడుం బిగిచింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.

కరోనా నేపథ్యంలో 11 రాష్ట్రాలు ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో మినహా మిగతా రాష్ట్రాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాలకు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్, శంషేర్ గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు.. ఒడిషాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 14న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 16వ తేదీ వరకూ నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 30న పోలింగ్ నిర్వహించనుండగా.. అక్టోబర్ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్తానాలకు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉప ఎన్నికలు ఇప్పుడే వద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాలు, పండుగల సీజన్ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. దీంతో ఆ 11 రాష్ట్రాలు మినహా బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికల షెడ్యూల్ ఈపీ విడుదల చేసింది.