Begin typing your search above and press return to search.

తమిళ స్టార్ హీరో..డబ్బులతో దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   7 May 2016 4:29 PM IST
తమిళ స్టార్ హీరో..డబ్బులతో దొరికిపోయాడు
X
పాపం శరత్ కుమార్ కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. సినిమాల్లో ఆయన పనైపోయి చాలా కాలమైంది. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన శరత్ కుమార్.. గత కొన్నేళ్లలో తీసిన సినిమాల్ని జనాలు ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత ‘నడిగర్ సంఘం’ ఎన్నికల్లో విశాల్ అండ్ కో ఆయన్ని పెద్ద దెబ్బే కొట్టింది. రాజకీయాల్లో కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. గత ఎన్నికల్లో ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈసారి అధికార డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని తన ‘మక్కల్ కచ్చి’ పార్టీ ద్వారా అభ్యర్థుల్ని నిలబెట్టారు శరత్ కుమార్. తాను కుూడా స్వయంగా తిరుచెండూర్ నియోజకవర్గంలో పోటీకి దిగారు.

ఐతే శనివారం తెల్లవారుజామున ఆయన కార్లో ప్రయాణిస్తుండగా.. ఎన్నికల సంఘం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఆయన కారును ఆపింది. తనిఖీలు నిర్వహించగా రూ.9 లక్షలకు పైగా నగదు పట్టుబడింది. ఆ డబ్బులకు లెక్కలేమీ లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల సంగతి అడిగితే శరత్ కుమార్ నీళ్లు నమిలారట.

ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరుపుతున్నారు. అధికార పార్టీతో జట్టు కట్టిన శరత్ ఇలా డబ్బులతో అధికారులకు దొరికిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంత తెల్లవారుజామున అంత డబ్బుతో ప్రయాణిస్తున్నాడంటే అది జనాలకు పంచడం కోసం తీసుకెళ్తున్నదే అని భావిస్తున్నారు.