Begin typing your search above and press return to search.
హుజూరాబాద్, బద్వేలు: ఎన్నికల కోడ్ పై ఈసీ క్లారిటీ
By: Tupaki Desk | 21 Oct 2021 3:56 PM GMTఉప ఎన్నికలు వచ్చేసరికి కేవలం ఆయా నియోజకవర్గాల వరకూ మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అక్కడ పథకాలు, లబ్ధి, ఇతర విషయాలన్నీ ఆగిపోతాయి.ప్రభుత్వం ఎన్నికల వేళ ఏం చేయడానికి ఉండదు. ఇక బదిలీలు, ఇతర అన్నింటిని ఈసీ పర్యవేక్షిస్తుంది. అయితే తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈసీ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.
ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర రాజధానులు, మెట్రో నగరాలు మినహా అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని సీఈసీ తెలిపారు. ఆయా నియోజకవర్గం వెలుపల జిల్లాలో నిర్వహించే ఎన్నికల కార్యక్రమాల ఖర్చులను అభ్యర్థుల ఖర్చుగానే పరిగణిస్తామని ఈసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం బద్వేలు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో అక్టోబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి.