Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?
By: Tupaki Desk | 1 Dec 2020 1:50 PM ISTపోలింగ్ అనగానే అందరూ ముందుగా ఆలోచించేది ఎగ్జిట్ పోల్స్ . చాలామంది ఎన్నికల పోలింగ్ సమయం ఎప్పుడు ముగుస్తోందా , ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. గెలిచి నిలిచేది ఎవరు, ఓడిపోయేదెవరు, అనేదానిపై పలు సంస్థలు, టీవీ చానెళ్లు తమ అంచనాలు, సర్వేలను వెల్లడిస్తాయి. గ్రేటర్‌లోని 150 డిజిన్లలో ఈ రోజు పోలింగ్ జరగాల్సి ఉండగా, ఒక చిన్న తప్పుతో ఓ డివిజన్ లో పోలింగ్ డిసెంబర్ 3 కి వాయిదా పడింది.
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ లో ఈ రోజు పోలింగ్ రద్దు చేయడంతో, డిసెంబర్ 3 న ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వమించనున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనితో ఎగ్జిట్ పోల్స్ పై డిసెంబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు నిషేధం విధిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఇకపోతే , ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కై, విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు గొడవకు దిగినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని చెప్పారు. కాగా, గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి రావడం గమనార్హం. ఇకపోతే, మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25.34 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.