Begin typing your search above and press return to search.
ఇంత దారుణమా? న్యాయం చేస్తామని చెప్పి.. కోట్లను నొక్కేసిన నేతలు
By: Tupaki Desk | 3 Oct 2021 6:00 AM ISTమోసపోయాం.. సాయం చేయమన్నోళ్లకు న్యాయం చేయాల్సిన రాజకీయ నేతలు.. బాధితుల సొమ్మును గద్దల్లా తన్నుకుపోయిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అనంతపురం కేంద్రంగా ‘ఈబిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో సంస్థను నిర్వహించి మాయమాలతో రూ.300 కోట్ల వరకు అమాయకుల నుంచి రూ.300 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన వైనం తెలిసిందే. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితులు తమకు న్యాయం చేయాలని.. సాయం చేసి తాము పోగొట్టుకున్న సొమ్ముల్ని తిరిగి ఇప్పించేలా చేయాలంటూ కడప.. అనంతపురం జిల్లాలకు చెందిన నేతల్ని సాయం అడిగితే.. ఈబిడ్ సంస్థ నిర్వాహకులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు లాగేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈబిడ్ మోసానికి బలైన బాధితులు ముగ్గురు నేతల్ని సాయం కోసం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన వారు ఈబిడ్ నిర్వాహకుల్ని బెదిరించి కోట్లాది రూపాయిల ఆస్తుల్ని తమ పేరుతో రాయించుకున్న వైనం కడప.. అనంత జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతకు చెందిన ఒక నేతకు తెలిసిన వారు ఈబిడ్ లో రూ.1.5కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఇష్యూలో సాయం కోరిన బాధితుడి తరఫున వకల్తా పుచ్చుకున్న ఒక నేత సెటిల్ మెంట్ లో భాగంగా తన పేరు మీద రూ.4-5 కోట్ల ఆస్తుల్ని రాయించుకున్నట్ులగా తెలుస్తోంది. దీనికి బదులుగా నిర్వాహకులకు ఏమీ కాకుండా చూస్తామన్న హామీని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అనంత జిల్లాకే చెందిన మరో నేతను బాధితులు ఆశ్రయిస్తే.. అతను సైతం ఈబిడ్ నిర్వాహకుల్ని బెదిరించి.. అత్యంత ఖరీదైన రెండు వాహనాల్ని బహుమతులుగా తీసుకొని సాయం కోరిన వారికి షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా.. మోసపోయామని.. సాయం చేయాలని కోరిన వారిని అడ్డం పెట్టుకొని ఈబిడ్ సంస్థ నిర్వాహకుల నుంచి భారీగా లాగేసిన తీరు ఇప్పుడు షాకింగ్ గామారింది.
ఇదిలా ఉంటే.. అసలీ మోసం ఎలా చేశారు? రూ.300 కోట్ల మొత్తాన్ని ఈబిడ్ ఎలా ఆకర్షించగలిగింది? అన్న విషయాల్లోకి వెళితే.. అనంతకు చెందిన సునీల్.. సంతోష్ లు అన్నదమ్ములు. మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా ఈబిడ్ ట్రేడర్స్ ను ప్రారంభించారు. గత ఏడాది దీన్ని ఈబిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ గా మార్చారు. తమ ఆఫీసును అనంతపురంలోనూ షురూ చేశారు.
తాము షేర్లలో భారీగా పెట్టుబడులు పెడతామని.. తమ వద్ద రూ.లక్ష పెట్టుబడి పెడితేనెలకు రూ.30వేలు చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఏజెంట్లను నియమించుకొని సీమలోని అనంత.. కర్నూలు.. కడప జిల్లాలలతో పాటు కర్ణాటక.. మహారాష్ట్రల్లో భారీగా డిపాజిట్లు సేకరించారు. ముందు చెప్పినట్లే కొంతకాలం డబ్బులు తిరిగి చెల్లించటంతో నమ్మి.. భారీగా పెట్టుబడులు పెట్టటం మొదలు పెట్టారు. ఈ విధంగా రూ.300 కోట్లు సేకరించి.. ఆ తర్వాత నుంచి చెల్లింపులు ఆపేశారు. కారణం అడిగితే.. ఏదో ఒకటి చెప్పేవారే కానీ డబ్బులు తిరిగి ఇచ్చేవారు కాదు. ఈబిడ్ కారణంగా భారీగా నష్టపోయారు. ఈ నష్టం నుంచి బయటపడేందుకు నేతల సాయం కోరితే.. వారు కూడా ఈబిడ్ నిర్వాహకుల్ని బెదిరించి వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందటం ఈ మొత్తం ఉదంతంలో అసలైన ట్విస్టుగా చెప్పాలి.