Begin typing your search above and press return to search.

వయాగ్రా కంటే ఇవి తింటే మీ శృంగారం డబుల్

By:  Tupaki Desk   |   9 May 2020 5:00 AM IST
వయాగ్రా కంటే ఇవి తింటే మీ శృంగారం డబుల్
X
లైంగిక సామర్థ్యం, ఆసక్తి తగ్గడానికి మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా లైంగిక ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతో పాటు ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం.

బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌ తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి.

తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారం పై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి.

స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా బెర్రీలను గింజలతో పాటు తింటారు కాబట్టి జింక్ దండిగా లభిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో స్తంభన సమస్యలు తలెత్తవు.

మిరప తినగానే ముఖం ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖంలోని రక్తనాళాలే కాకుండా పురుషాంగానికి రక్తం సరఫరా మెరుగవుతుంది. ఇది తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

ఉల్లి, వెల్లుల్లిలోని ఫిటోకెమికల్ ఎల్లిసిన్‌ రక్తాన్ని గడ్డకట్టుకుండా చేసి, ప్రసరణను పెంచుతుంది. వీటి వల్ల క్లాట్, క్లాగ్‌లు తగ్గిపోతాయి. దీనివల్ల రక్తనాళాల్లో ప్రసారం పెరిగి పురుషాంగం గట్టిపడి శృంగారానికి తోడ్పాటునందిస్తుంది. ఇలా ఇంట్లో దొరికే ఈ పదార్థాలను వాడి మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోండి..

ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలతో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని స్తంభన కలుగుతుంది. ములగపూలు , పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*శృంగార సామర్థ్యాన్ని పెంచే ఐదు పండ్లు ఇవీ..
1.ఆపిల్‌ :
ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు అయినా ఆపిల్‌ను తినవచ్చు. అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఆపిల్‌ను తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అంటారు. అలాగే ఆపిల్‌లో ఉండే ఫైబర్ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. పుచ్చకాయ :
వేసవిలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించే పుచ్చకాయలో ఔషధగుణాలు ఉంటాయి. ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెంచే గుణం ఈ పుచ్చకాయలో ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోదనల ద్వారా వెళ్లడైంది.

3. జామపండు : జామ కాయను కాకుండా జామ పండును తినడం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. జామపండులో ఉండే కొన్ని ప్రోటీన్‌లు పురుషుడి శరీరంలోని శృంగార హార్మోన్‌లను ప్రేరేపితం చేస్తాయి. అందుకే జామపండు శృంగార సామర్థ్యం పెంచడానికి దివ్వ ఔషదం అని చెప్పుకోవచ్చు.

4. మామిడి పండు :
మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుందంటారు. అయితే మోతాదులో తింటే ఆరోగ్యంకు చాలా మంచిది. మామిడి పండ్లతో రక్త ప్రసనణ వేగం పెరుగుతుంది. అందువల్ల ఇది శృంగార సామర్థ్యంను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

5.నేరేడు పండు :
ఎన్నో అద్బుత ఔషద గుణాలు కలిగి ఉన్న ఈ పండులో క్రోమియం మరియు పైబర్‌లు ఎక్కువగా ఉంటుంది. నేరేడు పండు తినడం వల్ల శృంగార సామర్థ్యంను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండు ప్రతి రోజు సాయంత్రం సమయంలో తినడం వల్ల రాత్రి శృంగారంలో రెచ్చి పోవచ్చు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.