Begin typing your search above and press return to search.

బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా ? అయితే మిమ్మల్ని ఆ దేవుడే ..?

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:34 AM GMT
బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా ? అయితే మిమ్మల్ని ఆ దేవుడే ..?
X
ప్రస్తుత ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. పని ఒత్తిడి కారణంగా చాలామంది యువత ఉదయాన్నే టిఫిన్ చేయడం కూడా మరచిపోతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా కొందరు ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. అలాగే నైట్ కూడా డిన్నర్ చాలా లేటుగా తింటున్నారు. అయితే , ఇలా ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌నుతినకుండా ఉండటం ..రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని డాక్టర్స్ తేల్చి చెబుతున్నారు.

ఇక ఉదయం పూట .. బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రూట్స్, ఉడకబెట్టిన కూరగాయలు, ఆమ్లెట్, ఇడ్లీ, వడ, దోశ , చద్దన్నం ..ఇలా ఎవరికీ నచ్చినవి వారు తింటుంటారు. కానీ , కంప్యూటర్ యుగంలో వల్ల చాలాసార్లు బ్రేక్‌ ఫాస్ట్‌ను బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. ఇకపై ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని , అలాగే హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో వెల్లడైనట్టు సమాచారం. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ , బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.

దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ ను పరీక్షించిన నిపుణులు . వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో టిఫిన్ తినని వారు 58 శాతం ఉండగా.. రాత్రి పూట లేటుగా తినేవారు 51 శాతం ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడలవాట్లు కలిగిన వారు 48 శాతం మంది ఉన్నారు. దీనితో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయని వారు ఇప్పటికైనా మేలుకొని.. బ్రేక్‌ ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా.. నైట్ భోజనం త్వరగా తినాలని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే పండ్లు, బ్రెడ్, చపాతీ, పాలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవటం మంచిది అని చెప్తున్నారు.