Begin typing your search above and press return to search.
బిడ్డల్ని చంపిన తల్లికి 120 ఏళ్ల జైలుశిక్ష!
By: Tupaki Desk | 28 Jun 2019 1:29 PM ISTపిల్లల ప్రాణాల కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లుల్ని చూశాం. వారి కోసం ఆరాటపడే అమ్మలెందరో. అందుకు భిన్నంగా అమ్మతనానికి కళంకళం తెచ్చేలా చోటు చేసుకున్న ఉదంతంలో అమెరికా కోర్టు ఒకటి సంచలన తీర్పును ఇచ్చారు. ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపిన ఉదంతంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. సంచలన తీర్పును ప్రకటించింది. పెరోల్ కు సాధ్యం కాని 120ఏళ్ల జైలును విధిస్తూ తీర్పును ఇచ్చింది. సంచలనంగా మారిన ఈ తీర్పులోకి వెళితే..
ఈస్ట్ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే అనే మహిళ నాలుగేళ్ల క్రితం (2015లో) తన ఆరేళ్ల కుమార్తె.. ఏడేళ్ల కొడుకును చంపేసింది. మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచేసింది. చనిపోయిన శరీరాల నుంచి వెలువడిన దుర్వాసనతో పక్కింటి ఇళ్ల వారు కంప్లైంట్ చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు తల్లితో పాటు.. పిల్లల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు కోర్టు విచారణలో భాగంగా నిందితురాలు తన వాదనను వినిపిస్తూ.. దేవుడు తన ఇద్దరు పిల్లల్ని చంపాలని చెప్పాడని.. అందుకే తాను చంపానని.. చనిపోయిన మూడో రోజు బతుకుతారని చెప్పటంతో తాను ఇంట్లో ఉంచుకున్నట్లుగా వెల్లడించింది. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ వాదనతో జడ్జి ఏకీభవించలేదు, ఇది చాలా తీవ్రమైన ఉదంతమని.. పిల్లల్ని చంపిన దోషికి కచ్ఛితంగా శిక్ష విధించాల్సిందేనని తేల్చింది. ఒక్కో పిల్లకు 60 ఏళ్లు చొప్పున ఇద్దరు పిల్లల్ని చంపిన దానికి ప్రతిగా 120 ఏళ్ల శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరోల్ కూడా ఇచ్చేది లేదని తేల్చారు. కన్నబిడ్డల్ని చంపుకున్న కసాయికి ఆ మాత్రం శిక్ష విధంచటం ఎంతమాత్రం తప్పు కాదంతే.