Begin typing your search above and press return to search.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. కేంద్రం కొత్త మెలిక

By:  Tupaki Desk   |   13 Sept 2020 3:20 PM IST
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. కేంద్రం కొత్త మెలిక
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు డీపీఐఐటీ డిపార్ట్ మెంట్ ఆదేశాలు ఇచ్చింది.2020-21 ర్యాంకుల కోసం మొత్తం 15 విభాగాల్లో నవంబర్ లోగా ఈ సంస్కరణలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 2019 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమ శాఖ కొత్త మార్గదర్శకాల అమలుకు పకడ్బందీగా ముందుకెళుతోంది.

నవంబర్ లోపే సంస్కరణలు అమలు చేయాల్సి ఉండడంతో ఏపీ పరిశ్రమల శాఖ నంబర్ 1 ర్యాంకును కాపాడుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులతో సమావేశాలు నిర్వహించి మర్గదర్శకాలపై అవగాహన కల్పిస్తోంది. సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ ఏడాది కొత్తగా టెలికాం, పర్యాటకం, ట్రేడ్ లైసెన్స్, ఆతిథ్యం, హెల్త్ కేర్, తూనికొలు కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్ ల విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ఎలాగైనా సరే ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది.