Begin typing your search above and press return to search.

గచ్చిబౌలిలో భూప్రకంపనలు..ఇళ్లల్లో నుండి పరుగులు తీసిన జనం !

By:  Tupaki Desk   |   15 Oct 2020 6:00 PM IST
గచ్చిబౌలిలో భూప్రకంపనలు..ఇళ్లల్లో నుండి పరుగులు తీసిన జనం !
X
హైదరాబాద్ ను ఒకవైపు వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే...మరోవైపు ప్రకంపనలతో మహానగరం మరోసారి ఉలిక్కి పడింది. గత మూడు రోజులుగా భారీ వర్షాలతో బిక్కుబిక్కుమంటూ నడిపిన నగర వాసులను ప్రకంపనలు మరోసారి వణికిస్తుంది. గచ్చిబౌలి టీఎన్టీవోస్‌ కాలనీవాసులు.. భూ ప్రకంపనలు, భారీ శబ్దాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి భూప్రకంపనల కారణంగా ఇళ్లల్లో వస్తువులు కదలడం, గేట్లు, ఆరుబయట సామగ్రి ఊగడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మంగళవారం రాత్రి 1.30 నుండి రాత్రి నాలుగు గంటల వరకు పలు మార్లు భూమి కంపించింది. ఆ తర్వాత బుధవారం మధ్యాహ్నం కూడా ప్రకంపించింది. మళ్లీ బుధవారం రాత్రి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలంతా భయపడి రోడ్లపైకి వచ్చేశారు. ఓ వైపు జోరువాన పడుతుండగానే భయంతో వానలతో తడుస్తూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం భయంతో ఆరు బయటే ఉండిపోయారు. అయితే తెల్లవారుజామున శబ్దాలు ఆగిపోవడంతో తిరిగి ఇండ్లలోకి వెళ్లారు.

ఈ సమాచారం అధికారులని ఇచ్చామని కాలనీవాసులు తెలిపారు. అయితే, అధికారులు మాత్రం భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ భూ ప్రకంపనలలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. గత కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో కూడా భూప్రకంపనలు జనాల్ని భయబ్రాంతులకు గురి చేశాయి. అయితే బోరబండలో వచ్చింది స్వల్ప భూకంపమేనన్నారు శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 1.5గా నమోదైందని తెలిపారు.