Begin typing your search above and press return to search.
చిత్తూరులో భూకంపం
By: Tupaki Desk | 1 Dec 2020 10:45 AM ISTఇటీవల కురిసిన భారీ వర్షాలు.. నివర్ నేపథ్యంలో తమిళనాడుతో పాటు.. సరిహద్దుజిల్లాల్లోనూ భారీగా వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి చిత్తూరుజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అక్కడి స్థానికుల్ని వణికేలా చేశాయి. దీంతో.. ప్రజలు మరో ఆలోచన లేకుండా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఉదంతం స్థానికులకు కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.
చిత్తూరు జిల్లాలోని రామకుప్ప మండలం కాప్పలి గ్రామంలో భూమి కదిలినట్లుగా కాస్త అనిపించింది.అనంతరం మూడుసార్లు ప్రకంపనలతోపాటు.. భూమి నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావటంతో హడలిపోతున్నారు. అయితే.. ఇది చాలా చాలా స్పల్వ ప్రకంపనలే తప్పించి మరింకేమీ కాదని చెబుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున వర్షాలు కురిసిన సమయంలో గచ్చిబౌలి.. బోరబండ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ప్రకంపనలు చోటు చేసుకోవటంతో పాటు.. పెద్ద ఎత్తున శబ్దాలు రావటాన్ని మర్చిపోకూడదు. భారీ వర్షాలుకురిసినప్పుడు భూమిలోపలకు నీళ్లు ఇంకే సమయంలో ఇలాంటి శబ్ధాలు వస్తుంటాయని జియాలజిస్టులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే తాజా ప్రకంపనలు ఉన్నట్లుగా చెప్పాలి. ఈ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భారీ వర్షాల వేళ.. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.