Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. సునామీ ముప్పు

By:  Tupaki Desk   |   18 Jun 2020 5:30 PM GMT
న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. సునామీ ముప్పు
X
న్యూజిలాండ్ దేశ చిగురుటాకులా వణికింది. ఈశాన్య న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని జియాలజిస్టులు తెలిపారు.

కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీవిలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపిందన్నారు.

భూకంపంతో న్యూజిలాండ్ లోి తౌరంగ, రొటోర్గా, వాటాఖనే, ఒపోటికి ప్రాంతాలపై పెను ప్రభావం పడిందని వార్తలు వెలువడ్డాయి.

భూకంప తీవ్రత ఏకంగా 7.1 ఉండడంతో భారీ భూకంపంగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా క్లారిటీ రాలేదు. భారీ నష్టమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా పెను భూకంపం రావడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని జియాలజిస్టులు పేర్కొంటున్నారు. ఇక అమెరికా జియాలజిస్టులు మాత్రం భూకంప తీవ్రతను మరింత పెంచి ఏకంగా 7.4 తీవ్రతతో వచ్చిందని తెలిపారు. దీంతో న్యూజిలాండ్ తీర ప్రాంతం వణికిపోయింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.