Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ రూ.5 కోట్లు సంపాదన

By:  Tupaki Desk   |   14 Feb 2022 10:01 AM IST
వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ రూ.5 కోట్లు సంపాదన
X
కరోనా కష్టకాలంలో అందరూ ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతుంటే.. ఈ అందివచ్చిన అవకాశాన్ని గొప్పగా వినియోగించుకున్నాడు. ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. వర్క్ ఫ్రం హోం పేరిట వచ్చిన అవకాశాన్ని వాడుకొని భారీగా సంపాదించాడు.

కరోనా కాలంలో సాఫ్ట్ వేర్ మొదలు చాలా రంగాలు వర్క్ ఫ్రం ఇచ్చేశాయి. ఐటీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యాయి. ఇంటి నుంచే ఉద్యోగులు చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే.. అనుకున్న విధంగా వర్క్ ముందుకు సాగడం లేదు. ఇంట్లో ఇబ్బందులు సహజమే..

అయితే యూరప్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం ఉద్యోగం చేస్తూ అక్షరాల ఏడాదికి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతడు 6 కంపెనీలకు ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరు ఫుల్ టైం జాబ్స్ కావడం విశేషం.

వర్క్ ఫ్రం హోం కారణంగా ఆరు రకాల ఉద్యోగాలు చేసే అవకాశం దొరికిందని.. అన్నింటిని మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. మిలియనీర్ కావలన్నది తన కల అని.. 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు సదురు వ్యక్తి రెడిట్ బ్లాగ్ లో రాసుకొచ్చాడు. అయితే అతడి పేరు మాత్రం బయటపెట్టలేదు.