Begin typing your search above and press return to search.

ఎంసెట్ లీకేజీ... ఇక‌ మిస్ట‌రీనే!

By:  Tupaki Desk   |   5 Jan 2017 11:49 AM IST
ఎంసెట్ లీకేజీ... ఇక‌ మిస్ట‌రీనే!
X
తెలంగాణ‌లో పెను క‌ల‌క‌ల‌మే రేపిన ఎంసెట్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ కుంభ‌కోణానికి సంబంధించిన గుట్టు వీడేలా క‌నిపించడం లేదు. తెలంగాణ‌నే కాకుండా ఏపీ విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్రుల‌ను షాక్‌ కు గురి చేసిన ఎంసెట్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ కుంభ‌కోణం ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను తెలంగాణ సీఐడీ తీసుకుంది. స‌ర్కారు ఆదేశాలతో ఇటీవ‌లే ఈ కేసు ద‌ర్యాప్తులో వేగం పెంచిన సీఐడీ అధికారులు బీహార్ రాజ‌ధాని పాట్నా వెళ్లి... కేసులో కీల‌క నిందితుడిగా భావిస్తున్న క‌మిలేశ్వ‌ర్‌ తో పాటు మ‌రో కీల‌క నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్ద‌రినీ అక్క‌డి కోర్టులో హాజ‌రుప‌ర‌చిన సీఐడీ ట్రాన్సిట్ వారెంట్ల‌పై నాలుగు రోజుల క్రితం హైద‌రాబాదుకు త‌ర‌లించారు. ఇక్క‌డ కూడా వారిద్ద‌రినీ కోర్టులో హాజ‌రుప‌రచి కోర్టు ఆదేశాల మేర‌కే వారిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో విచార‌ణ‌లో భాగంగా రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన క‌మిలేశ్వ‌ర్‌ ను సీఐడీ అధికారులు ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూనే నిన్న మధ్యాహ్నం క‌మిలేశ్వ‌ర్ చ‌నిపోయాడు. అయితే ఈ విష‌యాన్ని గుట్టుగానే ఉంచిన సీఐడీ అధికారులు... అత‌డి మృత‌దేహానికి హడావిడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అయినా కీల‌క కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న వ్య‌క్తికి గుండెపోటు రావ‌డం, అత‌డిని ఆసుప‌త్రికి త‌రలించ‌డం, చికిత్స అందిస్తున్న క్ర‌మంలోనే అత‌డు చ‌నిపోయినా... ఆ విష‌యాన్ని గుట్టుగా ఉంచ‌డ‌మే కాకుండా హ‌డావిడిగా పోస్టుమార్టం పూర్తి చేయించిన వైనంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిన్న మ‌ధ్యాహ్నం క‌మిలేశ్వ‌ర్ చ‌నిపోతే... నేటి ఉద‌యం దాకా అస‌లు ఈ విష‌యం బ‌య‌ట‌కే రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న క‌మిలేశ్వ‌ర్ మృతితో ఈ కేసుకు సంబంధించిన అస‌లు గుట్టు మిస్టరీగానే ఉండిపోవ‌డం ఖాయ‌మన్న వాద‌న వినిపిస్తోంది.

అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయ‌మున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న ప్ర‌ముఖుల పేర్లు ఇక ఎప్ప‌టికీ బ‌యట‌కు రావ‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయితే ఈ కేసును చాలా సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణిస్తున్న కేసీఆర్ స‌ర్కారు... కేసు మిస్ట‌రీగా మారిపోయిన వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో క‌మిలేశ్వ‌ర్ మృతిని మిస్ట‌రీగా మార్చేసిన సీఐడీ అధికారుల‌పై విచార‌ణ‌కు ఆదేశాలు ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న లేక‌పోలేదు. వెర‌సి క‌మిలేశ్వ‌ర్ మృతి ఎంసెట్ లీకేజీ వ్య‌వ‌హారంలో పెను క‌ల‌క‌లమే రేప‌నుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/