Begin typing your search above and press return to search.
యడ్డీ మార్కు.... ఒక్కో ఎమ్మెల్యేకి 3 సర్కారీ స్కూళ్ల దత్తత
By: Tupaki Desk | 6 March 2020 11:33 AM ISTకర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో గురువారం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భం గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందనే చెప్పాలి. సీఎంగా ఉన్నా కూడా ఆర్థిక శాఖ మీద మక్కువ తో ఆ శాఖను తన వద్దే ఉంచేసుకున్న యడ్డీ.. గురువారం 2020-21 ఏడాదికి సంబంధించి కర్ణాటక బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భం గా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న యడ్డీ... రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గం లోని మూడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఆయన... సర్కారీ బడులను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
యడ్డీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోక తప్పదు. కేవలం ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడంతోనే సరిపెట్టకుండా... ఆ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంతో పాటుగా విద్యా బోధనలో పెను మార్పులు తీసుకురావడంతో పాటుగా విద్యార్థుల ఉత్తీర్ణతను గణనీయంగా మెరుగుపరచే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ఒక్క నిర్ణయంతోనే సరిపెట్టని యడ్డీ... పాఠశాలల టైం టేబుల్ ను కూడా సమూలంగా మార్చేసేందుకు కూడా నడుం బిగించినట్లుగానే కనిపిస్తున్నారు. ప్రతి నెలలో రెండు శనివారాలు పిల్లలకు పుస్తకాలు, బ్యాగులతో పనిలేకుండా కార్యక్రమాలను అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే... గతంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ దేశంలోని పల్లె సీమలను అభివృద్ది చేసేందుకు ఒక్కో ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్దేశించారు. అనుకున్నదే తడవుగా ఎంపీలను ఆ బాట పట్టించిన మోదీ... గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు కూడా జరిగేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు యడ్డీ కూడా మోదీ మాదిరే దత్తత మంత్రాన్ని ఎత్తుకుని గ్రామాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యేలకు కండీషన్ పెట్టారు. మరి మోదీ గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాదిరే... యడ్డీ కూడా సర్కారీ స్కూళ్లలో ఏ మేర అభివృద్దిని పరుగులు పెట్టిస్తారో చూడాలి.