Begin typing your search above and press return to search.

పవనే పదే పదే గుర్తుకువస్తున్నారా... ?

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 AM GMT
పవనే పదే పదే  గుర్తుకువస్తున్నారా... ?
X
కాకినాడ సిటీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దూకుడు కలిగిన నేత. ఆయన జోరు చేయడం ద్వారానే రాజకీయాలలో తన స్థానాన్ని గట్టిపరచుకుంటూ వస్తున్నారు. అయితే అతి ఏది అయినా ఇబ్బందే. అందువల్ల ద్వారంపూడి జోరు ఇపుడు ఆయనకే చిక్కులు తెచ్చిపెట్టేలా ఉందని అంటున్నారు.

లేకపోతే ఆయన వరసబెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేయడమేంటి అన్న చర్చ వస్తోంది. నిజానికి గతంలో ద్వారంపూడి ఇంటికి వెళ్ళిన జనసేన కార్యకర్తలను ఆయన మనుషులు వెంటబెట్టి కొట్టడంతోనే అతి పెద్ద రాజకీయ రచ్చగా అది మిగిలింది. ఇక నాటి నుంచే జనసేన వర్సెస్ ద్వారంపూడి అన్నట్లుగా కధ సాగింది.

పవన్ కళ్యాణ్ కూడా లేటెస్ట్ గా ఆవిర్భావ సభలో ద్వారంపూడి మీద కామెంట్స్ చేసిన సంగతి విధితమే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు కూడా. దీంతో దానికి ఆ వెంటనే బదులిచ్చేశారు ద్వారంపూడి. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ చెప్పాల్సింది చెప్పేశారు.

అయితే ఇపుడు మళ్లీ లేటెస్ట్ గా మీడియా ముందుకు ప్రత్యేకంగా వచ్చి పవన్ మీద ద్వారంపూడి విరుచుకుపడడమే చర్చగా ఉంది. పవన్ కాకినాడలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామని ద్వారంపూడి చెప్పడం తో మళ్లీ మంట రాజుకుంది.

పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను ఆ నియోజకవర్గానికి ఇంచార్జిగా వెళ్ళి మరీ ఓడించి తీరుతానని ఆయన భారీ శపధమే చేశారు. ఇక జనసైనికులను పవన్ అన్యాయం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. త్వరలో పవన్ గురించి వారు తెలుసుకుంటారని సానుభూతి చూపారు.

మొత్తానికి ద్వారంపూడి ఇలా గట్టిగా రియాక్ట్ కావడం వెనక ఏముంది అన్నదే చర్చగా ఉంది. పవన్ తూర్పు గోదావరి జిల్లా నుంచి ఈసారి పోటీ చేస్తారని, మరీ ముఖ్యంగా కాకినాడ సిటీ కానీ రూరల్ కానీ ఎంచుకుంటారు అని చర్చకు వస్తోంది. దాంతో ముందుగానే పసిగట్టి ద్వారంపూడి ఈ సవాల్ చేశారా అన్న మాట అయితే ఉంది.

అదే టైం లో ద్వారంపూడి మంత్రి రేసులో ఉన్నారు. పవన్ ని చాలెంజ్ చేయడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు అని ఆయన చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి ద్వారంపూడి సవాళ్ళ సంగతేమో కానీ కోరి మరీ ఒక బలమైన సామాజికవర్గానికి వ్యతిరేకం తాను కావడమే కాకుండా పార్టీని చేస్తున్నారు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.

ఇక ద్వారంపూడి సవాల్ మీద జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాలం మారింది. పరిస్థితులూ మారాయి. ద్వారంపూడి మాత్రం ఇంకా అధికార భ్రమల్లోనే ఉన్నారని అన్నారు. ఈసారి ఆయన జాన్సేన చేతిలో ఓటమి పాలు కావడం ఖాయమని కూడా నాదెండ్ల ముందే జోస్యం చెప్పేశారు. మొత్తానికి చూడాలి పవర్ వర్సెస్ ద్వారంపూడి ఎపిసోడ్ రానున్న కాలంలో మరెన్ని మలుపులు తిరగనుందో.