Begin typing your search above and press return to search.
30 లక్షల మందిని చంపేస్తానన్న దేశాధ్యక్షుడు
By: Tupaki Desk | 1 Oct 2016 4:00 AM ISTపిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి సంచలన కామెంట్లు చేశారు. దేశంలోని డ్రగ్ బానిసలకు మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ యూదులను హిట్లర్ చంపినట్లుగా తాను కూడా మాదకద్రవ్యాలకు బానిసలైన వాళ్లను హతమార్చనున్నట్లు గట్టిగా హెచ్చరించారు. జర్మనీ నియంత హిట్లర్ సాగించిన హోలోకాస్ట్ మారణహోమంలో సుమారు 30 లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ పిలిప్పిన్స్ లో కూడా మూడు మిలియన్ల డ్రగ్ బానిసలున్నారని - వాళ్లను సంతోషంగా చంపేస్తానంటూ డుటెర్టి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
జూన్ లో దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డుటెర్టి దేశంలో డ్రగ్ వ్యాపారస్తులు - బానిసలపై విరుచుకుపడ్డారు. ఈ మధ్య కాలంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో సుమారు మూడు వేల మంది చనిపోయారు. కొన్ని చోట్ల రోడ్ల మీదే శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. వాటిని తీసుకెళ్లే వాళ్లు కూడా లేరు. పిలిప్పీన్స్ లో నేరాలను తగ్గించేందుకు లక్ష మంది నేరస్తులను చంపనున్నట్లు ఆయన శపథం చేశారు. దావో నగరానికి గతంలో మేయర్ గా చేసిన ఆయన అక్కడే తాజాగా ఆ వ్యాఖ్యలు చేయడం విశేషం. విమర్శకులు తనను కొందరు హిట్లర్ గా పోలుస్తున్నారని, అందుకే ఆ నియంత తరహాలోనే తాను కూడా డ్రగ్ బానిసలపై మరణమృందంగం మోగించనున్నట్లు చెప్పారు. రాబోయే తరాలను కాపాడేందుకు డ్రగ బానిసల ఏరివేత తప్పదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/