Begin typing your search above and press return to search.

లూయివిల్ లో దసరా సందడి

By:  Tupaki Desk   |   25 Oct 2016 9:50 AM GMT
లూయివిల్ లో దసరా సందడి
X
కెంటకీ రాష్ట్రం - లూయివిల్ నగరంలో తెలుగు సంఘం (టాక్) ఆధ్వర్యంలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. జయ నంబూరి బృందం ఆలపించిన విఘ్నేశ్వర ప్రార్థన తో కార్యక్రమం ప్రారంభమైంది. సంస్థ ప్రెసిడెంట్ ప్రతాప్ చిలుకూరి ఆహూతులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లత ఉమ్మాజి - రఘు కొడుమూరి - సత్య నోరి - సరస్వతి వడ్లమాని కార్యక్రమానికి వ్యాఖ్యానం అందించారు. అనిల్ రెడ్డి - శ్రీనివాస్ వేమూరి - లత ఉమ్మాజి సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించారు. సినీగీతాలకు చిన్నారులు ప్రదర్శంచిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. శ్రీని జూలకంటి బృందం ప్రదర్శించిన “టాపిక్ నెవర్ ఎండ్స్”, అనిల్ గంటేటి బృందం ప్రదర్శించిన “అబ్బ అసోసియేషన్” లఘునాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.

నృత్య కేంద్ర డాన్స్ అకాడెమీ - గురు వందన అకాడెమీల ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శంచిన భరతనాట్యం కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్థ చైర్మన్ రామ్ వంటిపల్లి కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కార్యవర్గ సభ్యులు చేసిన కృషిని అభినందించారు. డాక్టర్ పుష్పలత పావులూరి విరాళాలను అందించిన సంస్థలను - వ్యక్తులను సన్మానించారు.విరామ సమయంలో నర్మద పాటిల్ బృందం ప్రదర్శించిన "ఫ్లాష్ మాబ్ డాన్స్" ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అనంతరం, సంస్థ నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో విజేతలకు - సాంస్కృతిక కార్యక్ర్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ శ్రీని జూలకంటి కమిటీ సభ్యులకు - యూత్ వాలంటీర్లకు - కళాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి శశిధర్ సంగరాజు మీడియా కో-ఆర్డినేటర్ గా వ్యవహరించారు. కార్యక్రమం చివర్లో సంస్ఠ ఆధ్వర్యంలో తెలుగు వంటకాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు.