Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి పాలన వేళ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఫడ్నవీస్

By:  Tupaki Desk   |   13 Nov 2019 4:42 AM GMT
రాష్ట్రపతి పాలన వేళ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఫడ్నవీస్
X
మహా రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడై దాదాపు నాలుగు వారాలకు దగ్గరకు వస్తున్నప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లో క్లారిటీ రాని వేళ.. ఆర్నెల్లు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

288 స్థానాలున్న మహా రాష్ట్ర అసెంబ్లీ లో 105 స్థానాల్ని సొంతం చేసుకున్న బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదని తేల్చి చెప్పటం.. ఆ తర్వాత శివసేన.. ఎన్సీపీల కు గడువు ఇవ్వటం.. ఆ లోపే రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించటం లాంటి పరిణామాలు వేగంగా సాగిపోయాయి. సాధారణంగా ఫలితాలు ఏర్పడిన వెంటనే.. ప్రభుత్వ ఏర్పాటు కు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కానీ.. మహారాష్ట్ర లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఇలాంటి వేళ.. గవర్నర్ పుణ్యమా అని వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీన్ని పీక్స్ కు తీసుకెళ్లే లా చేయటం కేంద్రం సక్సెస్ అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరిన వేళలో.. తమ దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ లేదని చెప్పిన బీజేపీ నేతలు.. రాష్ట్రపతి పాలన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించినంతనే మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యను చేశారు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్.

రాష్ట్రపతి పాలన ముందు వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా వ్యవహరించిన ఆయన.. మహారాష్ట్ర లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మెజార్టీ లేదంటూనే.. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమని ఎలా చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తి కర అంశాలు బయటకు వస్తున్నాయి.

కాంగ్రెస్.. ఎన్సీపీల మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన శివసేనకు తత్త్వం బోద పడిందని.. తనకు అసలుసిసలు స్నేహితుడు బీజేపీ నే తప్పించి.. మరెవరూ కాదన్న విషయం పై క్లారిటీ వచ్చిందంటున్నారు. తన తప్పు తెలుసుకొని కాస్త తగ్గితే.. బీజేపీ - శివసేనతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యమంటున్నారు. ఒకవేళ ఇది కాకున్నా.. శివసేన లో చీలిక ద్వారా బీజేపీ తాను అనుకున్న పనిని పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వ ఏర్పాటు కు బీజేపీ కి తప్పించి మరెవరికీ అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పించి.. ఇందులో మార్పు ఉండదంటున్నారు.