Begin typing your search above and press return to search.
కీలకమైన పోలింగ్ వేళ.. వైరల్ గా మారిన ఇలాంటి పోస్టులెన్నో
By: Tupaki Desk | 1 Dec 2020 10:00 AM ISTనిజానికి దగ్గరగా ఉన్నట్లు కనిపించే అబద్ధపు పోస్టుల జోరు ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో భారీగా సాగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమ గొప్పతనం గురించి ప్రచారం చేసుకునే కంటే.. ప్రత్యర్థి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వటం ఈసారి ఎన్నికల ప్రత్యేకతగా చెప్పాలి. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలన్ని కూడా ప్రత్యర్థి పార్టీల తీరును ఓటర్లు నమ్మే వాదనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి.
ఆ వాదనలో కొంత నిజం ఉంటే.. మరికొంత అబద్ధం ఉందన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు పోస్టు చేసిన వైరల్ పోస్టునే చూస్తే.. బీజేపీకి వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పడుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో.. టీఆర్ఎస్.. మజ్లిస్.. కాంగ్రెస్ ఓట్లు అన్ని కూడా ఎంఐఎం ఖాతాలోకి పోతాయన్న పోస్టు చూసినంతనే.. తెర వెనుక ఏదో జరిగిపోతుందన్న భావన కలుగక మానదు.
ఎవరెన్ని చెప్పినా.. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికే మేయర్ పదవి దక్కనుందని చెప్పాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలుమార్లు సర్వేలు నిర్వహించి చూసినప్పుడు.. గతానికి మించి బీజేపీ ఓట్ల శాతం పెరగటం ఖాయమని చెప్పాలి. అదే సమయంలో.. టీఆర్ఎస్ ను ఓడించేంత శక్తియుక్తులు ఇంకా ఆ పార్టీకి రాలేదని చెప్పాలి. కాకుంటే.. తన పరిమితికి.. పరిధికి మించి పోటీ ఇచ్చిందని చెప్పాలి. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. మొండితనంతో పాటు పార్టీ పట్ల విధేయత.. అన్నింటికి మించిన కమిట్ మెంట్ చాలా ముఖ్యం.
ఈ విషయంలో టీఆర్ఎస్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో తమకుందన్న విషయాన్ని బీజేపీ కార్యకర్తలు.. అభిమానులు తమ చేష్టలతో ఇప్పటికే నిరూపించారు. ఈ కారణంతోనే టీఆర్ఎస్ నేతలు ఓటమి భయానికి గురవుతున్నారు. బస్తీల్లోని సంప్రదాయ టీఆర్ఎస్ ఓటర్లు పూనకం వచ్చి.. ‘పువ్వు’ గుర్తుకు గుద్ది పడేస్తే తప్పించి టీఆర్ఎస్ మాత్రమే గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోగలదు.
ఇక.. వైరల్ పోస్టు విషయానికి వస్తే.. ఇందులో పేర్కొన్నట్లుగా టీఆర్ఎస్.. మజ్లిస్.. కాంగ్రెస్ పార్టీలకు వేసిన ఓట్లు మొత్తం మజ్లిస్ ఖాతాలోకి ఎందుకు వెళతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అద్భుతమే జరిగి.. బీజేపీకి 90 సీట్లను సొంతం చేసుకుందనే అనుకుందాం.. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి దాదాపు 12 సీట్లు అవసరమవుతాయి. అందులో ఎక్స్ అఫీషియో ఓట్లు దాదాపుగా ఎడెనిమిది వరకు ఉన్నాయి. వాటిని కలిపినా 102 సీట్లు రావటం కష్టం. అందుకే...ఏ యాంగిల్ లో చూసినా బీజేపీ మేయర్ పదవిని చేజిక్కించుకోవటం అంత ఈజీ అయితే కాదు.
ఒకవేళ.. బీజేపీకి 80 సీట్లు వచ్చాయని అనుకుందాం. మజ్లిస్ కు 40 సీట్లు వచ్చాయనుకుందాం. టీఆర్ఎస్ కు 30 సీట్లు మాత్రమే వచ్చాయని అనుకుందాం. అప్పుడు గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే మజ్లిస్ తో పొత్తు పెట్టుకోవటం మినహా మరో మార్గం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకొని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటే.. టీఆర్ఎస్ కు జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అప్పుడు ఇలాంటి పోస్టులన్ని నిజం కావటం ఖాయం. అలా జరిగితే.. భవిష్యత్తులో గులాబీ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితి ఉంటుంది. అందుకే.. మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని మజ్లిస్ కోరినా.. అందుకు టీఆర్ఎస్ పార్టీ నో అనే అవకాశం ఉంది. ఒకవేళ.. మజ్లిస్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ సహకరిస్తే.. ఇక ఆ పార్టీ వ్యూహాత్మకంగా భారీ తప్పు చేసినట్లే అవుతుంది.