Begin typing your search above and press return to search.
బంద్ వేళ సామాన్యుడు ప్రశ్నించాడు.. ఎమ్మెల్యే గాంధీ రియాక్షన్ చూశారా?
By: Tupaki Desk | 8 Dec 2020 11:53 AM ISTప్రతి ఒక్కరి చేతుల్లో కెమేరా ఫోన్లు ఉన్న వేళ.. నేతలు జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో మాదిరి విరుచుకుపడటం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి గాంధీ వ్యవహారశైలి ఇప్పుడు వివాదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ కు తెలంగాణ అధికారపక్షం సంపూర్ణ మద్దతు ఇవ్వటం తెలిసిందే.
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్ నిర్వహిస్తున్నట్లుగా మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా ఉదయమే టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవరికి వారు.. వారి ప్రాంతాల్లో ధర్నాలు.. రాస్తారోకోలు చేయాలంటూ అధినాయకత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో.. అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం (ఉదయం 11 గంటల వేళకు) అన్నిచోట్ల ప్రశాతంతంగా బంద్ సాగుతున్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక పరిణామం టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. కుకట్ పల్లి ఉషాముళ్లపూడి వద్ద బ్యారికేడ్లు వేసి మరీ.. ఆందోళన నిర్వహించటంతో వాహనదారులు మొదలు సామాన్యుల వరకు చాలామంది ఇబ్బందికి గురయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్వయంగా ఆందోళన చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీల్లేనిరీతిలో బ్యారికేడ్లతో రోడ్డును మూసేశారు. దీంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది.
దీంతో..పలువురు సామాన్యులు ట్రాఫిక్ ఇబ్బందులతో చిరాకు పడ్డారు. ఒక మహిళ తీవ్రంగా తప్పు పట్టారు. ఇక.. ఒక సామాన్యుడు అయితే.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ..ఈ బంద్ స్వచ్ఛందం ఎందుకు అవుతుంది? ఇలా ఇబ్బంది పెడతారేంటి? అని ప్రశ్నించారు. దీంతో.. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గాంధీ.. ఆ వ్యక్తిని కాస్త వెనక్కి నెట్టారు. , అదునుగా తీసుకొని.. మరికొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు..ఆ సామాన్యుడ్ని నెట్టేశారు. ఈ సందర్భంగా కొంత గందరగోళం చోటు చేసుకుంది. సామాన్యుడు ప్రశ్నిస్తే.. ఇలా ట్రీట్ చేయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. కోరి తలనొప్పులు తెచ్చుకోవటంలో ఎమ్మెల్యే గాంధీ తర్వాతే ఎవరైనా అన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.