Begin typing your search above and press return to search.
దుబ్బాక ఫలితం నేపథ్యంలో.. హరీశ్ కానీ ఇలా చేస్తే బాగుండేదట
By: Tupaki Desk | 11 Nov 2020 10:15 AM ISTదుబ్బాక ఫలితం వచ్చింది. అధికార పార్టీకి దిమ్మ తిరిగే షాకిస్తే.. బీజేపీకి పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చింది. నిజానికి ఈ ఫలితాన్ని బీజేపీ నేతలు సైతం ఊహించలేదంటున్నారు. అధికార పార్టీకి ముప్పతిప్పలు పెట్టామన్న సంతోషంగా ఉన్న వారికి.. తాజా ఫలితం బోనస్ గా భావించక తప్పదు. గెలుపు అంచనాలు ఏ మాత్రం లేవన్న విషయాన్ని తమ అంతర్గత సంభాషణల్లో వారు చెప్పేస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించిన మంత్రి హరీశ్ రావుకు తాజా ఓటమి ఆయన మెడకు చుట్టుకున్నట్లైంది. ఉప ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే.. మంత్రి కేటీఆర్ స్పందించి తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తే.. దుబ్బాకను గెలిపించుకొస్తానని తన మేనమామకు మాటిచ్చినట్లుగా చెప్పిన హరీశ్.. కాస్త ఆలస్యంగా స్పందించారు. ఎన్నిక ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఓట్లు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పటంతో పాటు.. కష్టపడి పని చేసిన నేతలకు.. కార్యకర్తలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
మొత్తంగా చూస్తే.. దుబ్బాక ఉప ఎన్నిక హరీశ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్నమాట వినిపిస్తోంది. ఇలాంటివేళ..ఆయన సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఉంటే బాగుండేది. దుబ్బాక తన సమర్థతకు పరీక్షగా అందరూ భావిస్తున్న వేళ.. దానిలో తాను ఫెయిల్ అయినట్లుగా ఫలితం వచ్చినప్పుడు.. తన మేనమామ ఎలా అయితే.. రాజకీయ సంచలన నిర్ణయాలు తీసుకొని తనను తాను నిరూపించుకున్నారో.. అదే రీతిలో హరీశ్ కూడా తన మంత్రి పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే అదిరిపోయేలా ఉండేదన్న మాట ఆయన్ను విపరీతంగా అభిమానించే వారు పేర్కొనటం గమనార్హం.
ఇంతటి విపరీతమైన నిర్ణయాన్ని తీసుకోవాలని వారెందుకు భావిస్తున్నారన్నది చూస్తే అందులోనూ పాయింట్ ఉందని చెప్పక తప్పదు. ‘దుబ్బాకను సీరియస్ గా తీసుకొని పని చేసింది మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దుబ్బాక వైపు కన్నెత్తి చూపించలేదు. ప్రభుత్వం మీద ఉన్నవ్యతిరేకత.. కేసీఆర్.. కేటీఆర్ మీద ఉన్నకోపం.. వారు ఎంపిక చేసిన అభ్యర్థి కారణంగా ఓటమి తప్పలేదు. అందుకు బాధ్యత వహించాల్సిన వారు.. నోటి మాటగా కూడా బాధ్యత తీసుకోలేదు. అదే సమయంలో.. మా నాయకుడు మాత్రం ఓటమికి బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇక్కడ కేసీఆర్.. కేటీఆర్ ల కంటే కూడా పోయింది హరీశ్ కే అన్నది మర్చిపోకూడదు. సమర్థత విషయంలో హరీశ్ ఇప్పుడు ప్రశ్నగా మారారు ఇలాంటివేళ.. తానేమిటో నిరూపించుకోవటానికి హరీశ్ సంచలన నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. ఆయన సత్తా ఏమిటో సిద్ధిపేట ప్రజలు తమ తీర్పుతో చెప్పేసేవారు కదా?’’ అంటూ పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. ఇలాంటివి వినేందుకు బాగానే ఉంటాయి కానీ వాస్తవంలో అంతటి నాటకీయమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్నది మర్చిపోకూడదు.