Begin typing your search above and press return to search.

ఉత్తమ్ పై దుబ్బాక ఎఫెక్ట్ తప్పదా ?

By:  Tupaki Desk   |   11 Nov 2020 4:20 PM IST
ఉత్తమ్ పై దుబ్బాక ఎఫెక్ట్  తప్పదా ?
X
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక గాంధీభవన్ నుండి తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంట అదే అనుమానం పెరిగిపోతోంది. దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవని అందరికీ తెలిసిందే. కానీ ఓటమికి బాధ్యతగా పీసీపీ అధ్యక్షుడినే చేయటానికి రంగం సిద్ధమైపోయినట్లే అనుమానంగా ఉంది.

ఆమధ్య వరంగల్ లో జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయినపుడే ఉత్తమ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే వివిధ కారణాల వల్ల ఉత్తమ్ ఇంకా కంటిన్యు అవుతున్నారు. అయితే దుబ్బాక ఉఫ ఎన్నికలు మొదలవ్వగానే గెలుపుకు ఉత్తమ్ అధ్యక్ష పదవికి లింకు పెట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలు, ముఠాల ఆధిపత్యం ఉండే పార్టీగా అందరికీ తెలిసిందే. తమకు గిట్టని నేత పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే దింపేంత వరకు ప్రత్యర్ధులు పోరాటం చేస్తునే ఉంటారు.

ఇందులో భాగంగానే ఇపుడు ఉత్తమ్ ను పదవిలో నుండి దింపేయటానికి తెరవెనుక ప్రయత్నాలు మొదలైనట్లే అర్దమవుతోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోతే పీసీసీ అధ్యక్షుడి మార్పు తప్పదంటూ పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ కూడా బాహాటంగానే చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. మరి చాలామంది అనుకుంటున్నట్లు ఉత్తమ్ తట్టా బుట్టా సర్దేసుకుంటారో లేదో తొందలోనే తేలిపోతుంది.